మహిళలను హింసించే వారికి వేగంగా శిక్షలు

మహిళలను హింసించే వారికి కఠిన శిక్షలు వేగంగా పడే విధంగా దిశ బిల్లును సీఎం జగన్‌ రూపొందించారని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.

Updated : 26 Nov 2022 05:58 IST

రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: మహిళలను హింసించే వారికి కఠిన శిక్షలు వేగంగా పడే విధంగా దిశ బిల్లును సీఎం జగన్‌ రూపొందించారని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘మహిళలపై హింస ఎక్కువగా జరగడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న విషయమని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. కుటుంబ హింస, గృహహింస, పనిచేసే చోట లైంగిక వేధింపులు...ఇలా అనేక సవాళ్ల మధ్య మహిళలు ముందుకు అడుగులు వేస్తున్నారు. మహిళల చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, కుటుంబం, సమాజాన్ని మార్చకుండా మహిళలపై హింసను ఆపలేం’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు