వైకాపా నేతల దాడులపై త్వరలో ఆందోళన

వైకాపా అధికారంలోకి వచ్చాక దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలపై వేధింపులు, దాడులు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు, హత్యలు, అత్యాచారాలపై త్వరలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ప్రకటించారు.

Updated : 26 Nov 2022 05:57 IST

అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు బాలకోటయ్య

ఈనాడు, అమరావతి: వైకాపా అధికారంలోకి వచ్చాక దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలపై వేధింపులు, దాడులు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు, హత్యలు, అత్యాచారాలపై త్వరలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ప్రకటించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఈ మూడున్నరేళ్లలో జరిగిన దాడులు, దౌర్జన్యాలు గతంలో ఎప్పుడూ జరగలేదు. నర్సీపట్నంలో డాక్టర్‌ సుధాకర్‌ నుంచి కావలికి చెందిన దళిత యువకుడు దుగ్గిరాల కరుణాకర్‌ ఆత్మహత్య వరకు లెక్కకు మించి నేరాలు, ఘోరాలు దళితులపైనే జరిగాయి. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి నవంబరు 21 వరకు 113 రోజుల్లో 43 ఘటనలకు పాల్పడ్డారు. నవంబరు 15న వైకాపా నేతల కబ్జా కారణంగా పెందుర్తికి చెందిన కడియాల సోమేశ్వరరావు, అచ్చియ్యమ్మ అనే అన్నా చెల్లెళ్లు మృతి చెందారు. పొన్నూరుకు చెందిన అంజి బర్నబాస్‌, ఆకివీడుకి చెందిన ఆక్వా దళిత రైతు బూరుగ నాగేశ్వరరావు మృతి చెందారు. వైకాపా నేతల వేధింపులపై పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. కేసులు నమోదు చేస్తున్నా అరెస్టులు చేయడం లేదు. దళితులకు మేనమామను అని చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ..కంసమామగా మారారు’ అని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా దళిత, గిరిజన, బలహీన వర్గాలపై జరిగిన దాడులపై ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు