విద్యార్థులకు అకడమిక్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ పతకాలు

రాష్ట్రంలోని ఎస్సీ గురుకులాల్లో చదువులు, క్రీడల్లో ప్రతిభ కనబరిచే విద్యార్థులను ప్రోత్సహించేందుకు తరగతుల వారీగా పతకాలు అందించనున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు.

Published : 26 Nov 2022 05:22 IST

సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలోని ఎస్సీ గురుకులాల్లో చదువులు, క్రీడల్లో ప్రతిభ కనబరిచే విద్యార్థులను ప్రోత్సహించేందుకు తరగతుల వారీగా పతకాలు అందించనున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు. వచ్చే జనవరి నుంచి వారికి స్వర్ణ, రజత, కాంస్య పతకాలు అందిస్తామని ప్రకటించారు. సచివాలయంలో ఆయన శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘గురుకులాల్లో ఉండే విద్యార్థుల్లో 5 నుంచి 8వ తరగతి విద్యార్థులకు సాధారణ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా, 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు వారంతపు పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా పతకాలు అందిస్తాం. విద్య, క్రీడల్లో ప్రతి తరగతికీ ముగ్గురు చొప్పున అందిస్తాం. అకడమిక్స్‌లో గోల్డ్‌ స్టార్‌, సిల్వర్‌ స్టార్‌, బ్రౌంజ్‌ స్టార్‌ పతకాలు అందిస్తాం...’ అని మంత్రి నాగార్జున వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని