4 కేటగిరీల్లో విద్యార్థులకు రాష్ట్రస్థాయి అవార్డులు

ఉన్నత విద్యామండలి ఇటీవల నిర్వహించిన ప్రభావవంతమైన విద్యార్థి, సంఘ సేవ, ఉత్తమ విద్యార్థి అవార్డుల పోటీల్లో మొదటి 4 స్థానాలు సాధించిన విజేతలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

Published : 27 Nov 2022 04:48 IST

ఈనాడు, అమరావతి: ఉన్నత విద్యామండలి ఇటీవల నిర్వహించిన ప్రభావవంతమైన విద్యార్థి, సంఘ సేవ, ఉత్తమ విద్యార్థి అవార్డుల పోటీల్లో మొదటి 4 స్థానాలు సాధించిన విజేతలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభావవంతమైన విద్యార్థి అవార్డు కేటగిరీలో... వరసగా నాలుగు స్థానాల్లో మేడిశెట్టి సాయికిరణ్‌ (ఆంధ్ర లయోలా కళాశాల), అన్నపురెడ్డి హర్షిత (లక్కిరెడ్డి బాలిరెడ్డి కళాశాల), పొట్నూరు దీపిక (జీఎంఆర్‌ టెక్నాలజీ), వీఎన్‌ మణితేజ (లెండి కళాశాల) నిలిచారు. సంఘ సేవ విభాగంలో... విశాల్‌ తేజ (నిట్‌ తాడేపల్లిగూడెం), మేఘన కట్టా (ఆంధ్ర లయోలా), వి.శ్రీహర్షిత (రఘు కళాశాల), లక్ష్మి దీపికారెడ్డి (ఆదిత్య కళాశాల) మొదటి నాలుగు స్థానాల్లో నిలిచారు. ఉత్తమ విద్యార్థి కేటగిరీలో... జి.ప్రసూన (ట్రిపుల్‌ఐటీ, ఆర్కేవ్యాలీ), షేక్‌ ఖాజీపూర్‌ అజారుద్దీన్‌ (వీవీఐటీ), ఇప్పిలి పావని (విజ్ఞాన్‌), బి.అంజలి (సెయింట్‌ జోసెఫ్‌ కళాశాల) నిలిచారు. మొదటి స్థానంలో నిలిచిన వారికి రూ.లక్ష, ద్వితీయకు రూ.60 వేలు, తృతీయకు రూ.30 వేలు, నాలుగో స్థానంలో నిలిచిన వారికి రూ.10 వేల చొప్పున నగదు బహుమతి అందిస్తారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు