భూటాన్‌శాట్‌ రూపకర్తది నెల్లూరే

భారత్‌, భూటాన్‌ అంతరిక్షంలోకి పంపిన భూటాన్‌శాట్‌ రూపకర్త నెల్లూరు వాసి రవిచంద్ర బాబు. గంధం చంద్రయ్య, సుశీలమ్మల కుమారుడు. ఆయన తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో మెకానికల్‌ బీటెక్‌ చేశారు.

Published : 27 Nov 2022 04:48 IST

సూళ్లూరుపేట, న్యూస్‌టుడే: భారత్‌, భూటాన్‌ అంతరిక్షంలోకి పంపిన భూటాన్‌శాట్‌ రూపకర్త నెల్లూరు వాసి రవిచంద్ర బాబు. గంధం చంద్రయ్య, సుశీలమ్మల కుమారుడు. ఆయన తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో మెకానికల్‌ బీటెక్‌ చేశారు. అనంతరం ఐఐటీ దిల్లీలో ఇండస్ట్రియల్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ పూర్తిచేశారు. 1999లో ఇస్రోలో శాస్త్రవేత్తగా చేరి, ఉపగ్రహ ప్రాజెక్టు డైరెక్టర్‌ స్థాయికి ఎదిగారు. ఆయన సారథ్యంలో ఆరు నెలల్లో భూటాన్‌శాట్‌ రూపుదిద్దుకుంది. తన సారథ్యంలో భూటాన్‌శాట్‌ తయారుచేయడం, దాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టడం మరింత ఆనందాన్ని ఇచ్చిందని రవిచంద్ర బాబు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని