రామకుప్పంలో దళిత సంఘాల ధర్నా

అంబేడ్కర్‌ విగ్రహానికి పోలీసులు పూలమాల వేయనివ్వలేదని చిత్తూరు జిల్లా రామకుప్పంలో శనివారం దళిత సంఘాలు నిరసన చేపట్టాయి. గ్రామంలో గతేడాది ఉద్రిక్తతల నడుమ ఉద్యమకారుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ విగ్రహాలను ప్రతిష్ఠించారు.

Published : 27 Nov 2022 04:48 IST

అంబేడ్కర్‌కు పూలమాల వేయనివ్వలేదని నిరసన

రామకుప్పం, న్యూస్‌టుడే: అంబేడ్కర్‌ విగ్రహానికి పోలీసులు పూలమాల వేయనివ్వలేదని చిత్తూరు జిల్లా రామకుప్పంలో శనివారం దళిత సంఘాలు నిరసన చేపట్టాయి. గ్రామంలో గతేడాది ఉద్రిక్తతల నడుమ ఉద్యమకారుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ విగ్రహాలను ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. శనివారం రాజ్యాంగ దినోత్సవంలో భాగంగా దళిత సంఘాలు అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించేందుకు వెళ్లగా గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు అడ్డుకున్నారు. రెవెన్యూ అధికారుల ఆదేశాల మేరకు విగ్రహాలవద్దకు ఎవరూ వెళ్లకూడదని హెచ్చరించారు. పోలీసులు అనుమతించకపోవడంతో దళిత నాయకులు మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట అంబేడ్కర్‌ చిత్రపటాలతో నిరసన చేపట్టారు. అధికారులు స్పందించకపోవడంతో రామకుప్పం-కుప్పం రహదారిపై రాత్రి వరకు ధర్నా నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని