Gudivada Amarnath: 3 రాజధానుల బిల్లు ప్రవేశపెడతాం: మంత్రి అమర్‌నాథ్‌

‘మూడు రాజధానులకు అందరి మద్దతు ఉంది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అనుకూలంగా తీర్మానాలు చేశారు. త్వరలోనే ముఖ్యమంత్రి విశాఖ నుంచి పరిపాలన సాగిస్తారు’ అని పరిశ్రమలశాఖ మంత్రి అమర్‌నాథ్‌ పేర్కొన్నారు.

Updated : 27 Nov 2022 09:16 IST

త్వరలో విశాఖ నుంచే ముఖ్యమంత్రి పాలన

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: ‘మూడు రాజధానులకు అందరి మద్దతు ఉంది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అనుకూలంగా తీర్మానాలు చేశారు. త్వరలోనే ముఖ్యమంత్రి విశాఖ నుంచి పరిపాలన సాగిస్తారు’ అని పరిశ్రమలశాఖ మంత్రి అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. విశాఖలో శనివారం జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. మూడు రాజధానుల బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడతామని, ఇందులో అనుమానాలకు తావులేదని చెప్పారు. ‘పాదయాత్రపై పేటెంట్‌ రాజశేఖర్‌రెడ్డి కుటుంబానిది. వారు యాత్రల ద్వారా ప్రజల్లో భరోసా నింపారు. నారా లోకేశ్‌ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలి. రాష్ట్రంలో ఏ సమస్య ఉందని చేస్తారు’ అని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని