జగనన్న గోరుముద్ద తిని అస్వస్థత

జగనన్న గోరుముద్ద పేరిట ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో ఆహారం తిని 51 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

Updated : 27 Nov 2022 10:18 IST

51 మంది విద్యార్థులకు వాంతులు, విరేచనాలు  
వైయస్‌ఆర్‌, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో ఘటనలు

చక్రాయపేట, పాలకోడేరు, పెదవేగి, న్యూస్‌టుడే: జగనన్న గోరుముద్ద పేరిట ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో ఆహారం తిని 51 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గం, చక్రాయపేట మండలం బురుజుపల్లె ప్రాథమిక పాఠశాలలో శనివారం మధ్యాహ్నం మెనూ ప్రకారం కరివేపాకు రైస్‌ చేశారు. 44 మంది విద్యార్థులు తినగా 15 మంది కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరులో నం-1 మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో 183 మంది మధ్యాహ్న భోజనం తిన్నారు. కొద్దిసేపటికి 21 మంది అస్వస్థతకు గురికావడంతో వారిని 108 వాహనంలో పాలకోడేరు పీహెచ్‌సీకి తరలించారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం కూచింపూడి జడ్పీ ఉన్నత పాఠశాలలో 389 మంది మధ్యాహ్న భోజనం చేశారు. 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికాగా పెదవేగిలోని పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని