Andhra News: కలెక్టర్లే వెళ్లలేని జగనన్న కాలనీలు

బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో జగనన్న కాలనీల్లో కనీస వసతులు కరవయ్యాయి. భట్టిప్రోలు మండలం సూరేపల్లి గ్రామంలోని లేఅవుట్‌ను కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ శనివారం పరిశీలించారు.

Updated : 27 Nov 2022 07:30 IST

బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో జగనన్న కాలనీల్లో కనీస వసతులు కరవయ్యాయి. భట్టిప్రోలు మండలం సూరేపల్లి గ్రామంలోని లేఅవుట్‌ను కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ శనివారం పరిశీలించారు. రహదారి అధ్వానంగా ఉండటంతో కాలనీలోకి వెళ్లటానికి కలెక్టర్‌, అధికారులు ఇబ్బందిపడ్డారు. వాహనాలు వదిలి నడుచుకుంటూ వెళ్లారు. వేమూరులో లేఅవుట్‌ను తన వాహనంలో చేరేందుకు జిల్లా సంయుక్త కలెక్టర్‌ శ్రీనివాసులు తంటాలుపడాల్సి వచ్చింది. గుంతలతో నిండిన మురుగు కాల్వ కట్ట మార్గంలో.. ముళ్ల చెట్ల మధ్య నుంచి లేఅవుట్‌కు చేరుకున్నారు. స్థలాలు ఇచ్చి రెండేళ్లు కావస్తున్నా కనీసం రహదారి వేయకపోవడంతో స్థానిక అధికారులపై జేసీ అసహనం వ్యక్తం చేశారు. ఈ లేఅవుట్‌లో సుమారు 690 మంది లబ్ధిదారులు ఉండగా ఒక్క ఇల్లు నిర్మాణం పూర్తి కాకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన నగదు ప్రోత్సాహకం రూ.1.80 లక్షలు పునాదులకే చాలవని చంపాడు లేఅవుట్‌లోని లబ్ధిదారులు జేసీకి వివరించారు. ‘ముందు మీరు నిర్మాణాలు చేపట్టండి. తరువాత రోడ్లు వేయిస్తామంటూ’ ఆయన ముందుకు సాగడం గమనార్హం.

- న్యూస్‌టుడే, వేమూరు, భట్టిప్రోలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని