మట్టి పోశారు.. మరిచిపోయారు

గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్ట విస్తరణ పనులకు రూ.150 కోట్లతో 2021 జూన్‌లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. కొండవీటి వాగు పంపింగ్‌ స్టేషన్‌ నుంచి ఎన్‌-13 రోడ్డు వరకు 15.5 కి.మీ దూరం కరకట్టను విస్తరించి బలోపేతం చేయాల్సి ఉంది.

Published : 27 Nov 2022 05:08 IST

గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్ట విస్తరణ పనులకు రూ.150 కోట్లతో 2021 జూన్‌లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. కొండవీటి వాగు పంపింగ్‌ స్టేషన్‌ నుంచి ఎన్‌-13 రోడ్డు వరకు 15.5 కి.మీ దూరం కరకట్టను విస్తరించి బలోపేతం చేయాల్సి ఉంది. పనులు ప్రారంభమై 17 నెలలు అవుతోంది. మంతెన ఆశ్రమం నుంచి అర కిలోమీటరు వరకూ కరకట్ట పక్కన జేసీబీలతో తవ్వి మట్టిని పోశారు. భూసేకరణ జరగకపోవడం, పరిహారం విషయంలో సమస్యలు తలెత్తడంతో రైతులు పనులను ఆపించేశారు. ఈ దారిలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఐఏఎస్‌ అధికారులు సచివాలయం వెళ్తుంటారు. ఇంత ముఖ్యమైన దారి విస్తరణ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అమరావతి రైతులు ఆరోపిస్తున్నారు.

- ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని