Andhra News: జగన్‌ మామా.. ఉపాధ్యాయులేరీ?

‘జగన్‌ మామా.. ఉపాధ్యాయులు లేరు మామా’ అంటూ పల్నాడు జిల్లా గురజాల మండలం మాడుగులలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు.

Published : 28 Nov 2022 07:28 IST

ప్లకార్డులతో విద్యార్థుల నిరసన

గురజాల, న్యూస్‌టుడే: ‘జగన్‌ మామా.. ఉపాధ్యాయులు లేరు మామా’ అంటూ పల్నాడు జిల్లా గురజాల మండలం మాడుగులలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు. గురజాలలో ఆదివారం గుంటూరు- మాచర్ల రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పదో తరగతి చదువుతున్న 18 మందికి తోడుగా పాఠశాలలో మిగిలిన విద్యార్థులు కొందరు ఆటోల్లో గురజాల చేరుకున్నారు. ఇద్దరు ఉపాధ్యాయులే పదో తరగతి పాఠాలు బోధిస్తుంటే ఎలా చదువుకోవాలంటూ ప్లకార్డులతో ఆవేదన వ్యక్తం చేశారు. తరగతులు సరిగా జరగకుండా పరీక్షలు ఎలా రాయాలని ప్రశ్నించారు. పాఠశాలలో ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేకపోవడంతో నిరసన చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని తహసీల్దారు దానియేలు వద్దకు తీసుకెళ్లారు. వారంలోగా ఉపాధ్యాయులు వచ్చేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు