శభాష్‌ వెంకటేశ్వర్లు.. ఆత్మహత్యకు యత్నించిన తల్లీపిల్లల్నిరక్షించిన రైల్వే ఉద్యోగి

ఆదివారం ఉదయం 10 గంటల సమయం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ 5, 8 సంవత్సరాల వయసున్న ఇద్దరు కుమార్తెలతో కలిసి గొల్లప్రోలు మండలం దుర్గాడ రైల్వేగేటు సమీపంలోని రైలు పట్టాలపైకి చేరుకున్నారు.

Published : 28 Nov 2022 07:38 IST

ఆదివారం ఉదయం 10 గంటల సమయం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ 5, 8 సంవత్సరాల వయసున్న ఇద్దరు కుమార్తెలతో కలిసి గొల్లప్రోలు మండలం దుర్గాడ రైల్వేగేటు సమీపంలోని రైలు పట్టాలపైకి చేరుకున్నారు. విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వస్తున్న సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఎదురుగా వెళ్లేందుకు యత్నించారు. దీన్ని గమనించిన రైల్వే కీమ్యాన్‌ పడిమి వెంకటేశ్వర్లు పరుగున వెళ్లి వారిని పక్కకు లాగారు.

వెంటనే 100 నంబరుకు ఫోన్‌చేసి పోలీసులకు సమాచారం అందించారు. పిఠాపురం సీఐ వైఆర్‌కే శ్రీనివాసు సిబ్బందితో అక్కడికి వెళ్లి తల్లి, పిల్లలను తన కార్యాలయానికి తరలించి బాధితురాలితో మాట్లాడారు. అనంతరం కాకినాడలోని దిశ పోలీసు స్టేషన్‌కు పంపి కౌన్సెలింగ్‌ ఇచ్చి ఆమెను పుట్టింటికి పంపించారు. భర్తతో వివాదమే ఆత్మహత్యాయత్నానికి కారణమని తెలుస్తోంది. అప్రమత్తతతో ముగ్గురిని రక్షించిన కీమ్యాన్‌ వెంకటేశ్వర్లును సీఐ శ్రీనివాసు, సిబ్బంది, స్థానికులు అభినందించారు. మహిళ కుటుంబ సభ్యులతో చర్చించి తదుపరి చర్యలు చేపడతామని సీఐ తెలిపారు.

న్యూస్‌టుడే, గొల్లప్రోలు

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు