కాళ్లు మొక్కుతాం.. రోడ్డు వేయించండి సార్‌!

‘ఎమ్మెల్యేలు మారారు. ప్రభుత్వాలు మారాయి. మా రోడ్డు మాత్రం బాగు పడలేదు.

Updated : 28 Nov 2022 11:08 IST

ఎమ్మెల్యే మధుసూదన్‌ యాదవ్‌కు గ్రామస్థుల వినతి

కనిగిరి, న్యూస్‌టుడే: ‘ఎమ్మెల్యేలు మారారు. ప్రభుత్వాలు మారాయి. మా రోడ్డు మాత్రం బాగు పడలేదు. 30 ఏళ్లుగా అతుకుల బొంత లాంటి రహదారిపై రాకపోకలు సాగించలేక అవస్థలు పడుతున్నాం. మీ కాళ్లు పట్టుకుంటాం... మీరైనా రోడ్డు వేయించండి సారూ! అంటూ తుమ్మగుంట, నడింపల్లి గ్రామస్థులు ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌కు చేతులెత్తి మొక్కారు. ఆదివారం ప్రకాశం జిల్లా కనిగిరి మండలం తుమ్మగుంటలో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ఎమ్మెల్యే వచ్చారని తెలిసి రెండు గ్రామాల ప్రజలు వచ్చి తమ సమస్యలను విన్నవించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యలన్నీ తీరుస్తామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు