TTD: తితిదే 2023 డైరీలు, క్యాలెండర్లు.. కావాలంటే ఇలా చేయండి..
తితిదే ప్రతిష్ఠాత్మకంగా ముద్రించిన 2023వ సంవత్సరం క్యాలెండర్లు, డైరీలు భక్తులకు అందుబాటులోకి వచ్చాయి.
తిరుమల, న్యూస్‌టుడే: తితిదే ప్రతిష్ఠాత్మకంగా ముద్రించిన 2023వ సంవత్సరం క్యాలెండర్లు, డైరీలు భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. తిరుపతి, తిరుమలలోని తితిదే పుస్తక విక్రయ కేంద్రాల్లో వీటిని ఉంచినట్లు తితిదే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. అదేవిధంగా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయాలతోపాటు నెల్లూరు, రాజమహేంద్రవరం, కాకినాడ, కర్నూలు, నంద్యాల, హనుమకొండలోని తితిదే కల్యాణ మండపాల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపింది.
తితిదే క్యాలెండర్లు, డైరీలను భక్తులు tirupatibalaji. ap.gov.in వెబ్సైట్లో పబ్లికేషన్స్‌ను క్లిక్‌చేసి డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఆర్డరు చేయవచ్చు. తపాలాశాఖ ద్వారా ఇంటివద్దకే అందిస్తున్నట్లు తితిదే తెలిపింది. భక్తులు డీడీ తీసి పంపొచ్చు. ఇందుకోసం ‘కార్యనిర్వహణాధికారి, తితిదే, తిరుపతి’ పేరిట ఏదైనా జాతీయ బ్యాంకులో డీడీ తీసి కవరింగ్ లెటర్‌తో కలిపి ‘ప్రత్యేకాధికారి, పుస్తక ప్రచురణల విక్రయ విభాగం, ప్రెస్ కాంపౌండ్, కేటీ రోడ్డు, తిరుపతి’ అనే చిరునామాకు పంపాల్సి ఉంటుంది. ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు ద్వారా భక్తులకు తితిదే క్యాలెండర్, డైరీలను పంపుతారు. రవాణా ఛార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు 99639 55585, 0877-2264209 నంబర్లలో సంప్రదించాలని సూచించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Arvind Kejriwal: రాజకీయాల్లో ‘ఆమ్ఆద్మీ’ సక్సెస్.. ఎందుకంటే..!
-
Sports News
IPL 2023: అప్పటికల్లా.. ఫుట్‌బాల్ లీగ్ కంటే అతిపెద్ద ఈవెంట్ ఐపీఎల్ అవుతుంది: స్ట్రాస్
-
World News
Hong Kong: 5 లక్షల విమాన టికెట్లు ఫ్రీ.. పర్యాటకులకు హాంకాంగ్ ఆఫర్!
-
Movies News
Pawan Kalyan: సినిమాల నుంచి అప్పుడే రిటైర్డ్ అవ్వాలనుకున్నా.. నా పెళ్లిళ్లు అనుకోకుండానే..!: పవన్ కల్యాణ్
-
Politics News
Nitin Gadkari: నితిన్ గడ్కరీ ఇలాకాలో భాజపాకి ఎదురుదెబ్బ
-
Crime News
Andhra News: విజయవాడలో విషాదం.. వాటర్ హీటర్ తగిలి తండ్రి, కుమార్తె మృతి