బాలిక బతుకు పోరాటం
రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం. ప్రశాంతంగా సాగిపోతున్న ఆ కుటుంబంలో ఊహించని కుదుపు. డ్రైవింగ్ లైసెన్సు లేని 20 ఏళ్ల యువకులు మద్యం తాగి ద్విచక్ర వాహనం నడుపుతూ వారి పెద్ద కుమార్తెను ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రిలో చేరి ఇప్పుడు బతుకు పోరాటం చేస్తోంది.
ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఆసుపత్రిపాలు
17 రోజులుగా వైద్యం అందిస్తున్నా స్పృహలోకి రాని బాధితురాలు
పేద కుటుంబానికి భారంగా వైద్య ఖర్చులు
దేవరపల్లి, న్యూస్‌టుడే: రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం. అమ్మానాన్నల కష్టాన్ని గుర్తించిన ముగ్గురు పిల్లలు చదువు, ఆటపాటల్లో రాణిస్తున్నారు. చురుకైన పెద్ద కుమార్తె తల్లికి చేదోడుగా ఉండేది. ప్రశాంతంగా సాగిపోతున్న ఆ కుటుంబంలో ఊహించని కుదుపు. డ్రైవింగ్ లైసెన్సు లేని 20 ఏళ్ల యువకులు మద్యం తాగి ద్విచక్ర వాహనం నడుపుతూ వారి పెద్ద కుమార్తెను ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రిలో చేరి ఇప్పుడు బతుకు పోరాటం చేస్తోంది. మూసిన కన్ను తెరవకుండా.. కృత్రిమ శ్వాస తీసుకుంటోంది. తమ కలల ప్రతిరూపం ఎప్పుడు స్పృహలోకి వస్తుందా? అని తడారని కన్నులతో ఆ తల్లిదండ్రులు దీనంగా చూస్తున్నారు. తమతో ఆడుకునే అక్క కదల్లేని స్థితిలో ఉండటం చూసి చెల్లి, తమ్ముడు మౌనంగా రోదిస్తున్నారు. ఎవరో చేసిన తప్పునకు ఆ బాలిక అనుభవిస్తున్న శిక్ష ఆ పేద కుటుంబానికి పెద్ద పరీక్షగా నిలిచింది.
పాఠశాల నుంచి వెళ్తుండగా...
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం సుబ్బరాయపురం గ్రామంలో రాపాక శ్రీను, లక్ష్మి దంపతులు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె ఝూన్సీ శ్రీలక్ష్మి (12) కృష్ణంపాలెం మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. ఈ నెల 10న పాఠశాల నుంచి ఇంటికెళ్తుండగా మద్యం మత్తులో ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు యువకులు ఆమెను బలంగా ఢీకొని ఆసుపత్రి పాల్జేశారు.
కోలుకోక.. కునుకు లేక...
ఆశల దీపాన్ని ఆరోగ్యంగా చూడాలని ఆ దంపతులు కూడబెట్టినదంతా ఖర్చు చేశారు. 17 రోజులుగా వైద్యం అందిస్తున్నా శ్రీలక్ష్మి పూర్తి స్థాయిలో కోలుకోలేదు. రోజుకు సుమారు రూ.40వేల దాకా ఖర్చవుతోంది. కూలినాలి చేసుకుని బతికే తాము అంత సొమ్ము ఎలా భరించగలమని రోదిస్తున్నారు. వీరి కుటుంబ పరిస్థితి తెలిసిన కొందరు వదాన్యులు తమకు తోచిన సాయం చేసినా.. అవసరమైనంత మొత్తం ఎలా సమకూర్చుకోవాలో తెలియక తల్లడిల్లుతున్నారు. మరో వైపు ఆ బాలిక పరిస్థితిని 25 రోజుల వరకూ చెప్పలేమని వైద్యులు పేర్కొనడం వారిని మరింత కుంగదీస్తోంది. ఈ కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టిన ఇద్దరు యువకులపై కేసు నమోదు చేశామని దేవరపల్లి ఎస్సై శ్రీహరిరావు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
YSRCP: ప్రతి ఇంటికీ జగన్ స్టిక్కర్!
-
Crime News
సహజీవనం చేస్తూ హతమార్చాడు: తల్లీకుమార్తెలను గునపంతో కొట్టి చంపిన ప్రియుడు
-
Sports News
Sunil Gavaskar: బ్రిస్బేన్ పిచ్ గురించి మాట్లాడరేం?
-
Politics News
Bhuma Akhila Priya: నంద్యాల ఎమ్మెల్యే ఇన్సైడర్ ట్రేడింగ్: భూమా అఖిలప్రియ
-
Politics News
YSRCP: వచ్చే ఎన్నికల్లో పోటీచేయను: వైకాపా ఎమ్మెల్యే సుధాకర్
-
Politics News
Andhra News: నీతో మాట్లాడను, వెళ్లవమ్మా.. వెళ్లు!: మహిళపై వైకాపా ఎమ్మెల్యే అసహనం