యాదాద్రిలో భక్తుల సందడి

యాదాద్రి పుణ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ పరిసరాలు, మండపాలు, క్యూ కాంప్లెక్స్‌తో పాటు ప్రసాదాల విక్రయశాల, కొండ కింద కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి ప్రాంగణాలు సందడిగా మారాయి.

Updated : 28 Nov 2022 04:37 IST

40 వేల మంది రాక

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రి పుణ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ పరిసరాలు, మండపాలు, క్యూ కాంప్లెక్స్‌తో పాటు ప్రసాదాల విక్రయశాల, కొండ కింద కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి ప్రాంగణాలు సందడిగా మారాయి. సుమారు 40 వేల మంది భక్తులు శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. రూ.73,97,136 ఆదాయం సమకూరిందని చెప్పారు. ఎంపీ, ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్‌ పంచనారసింహులను దర్శించుకుని పూజలు చేశారు. ఆయనకు ఆలయ ప్రొటోకాల్‌ అధికారి ఉడెపు రాజు దేవుడి ప్రసాదం అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని