పరిశ్రమల శాఖలో జేడీల బదిలీలు?

పరిశ్రమల శాఖలో పలువురు జాయింట్‌ డైరెక్టర్‌ (జేడీ) స్థాయి అధికారుల బదిలీకి రంగం సిద్ధమైనట్లు తెలిసింది.

Published : 28 Nov 2022 04:50 IST

సీఎం ఆమోదం కోసం జాబితా

ఈనాడు, అమరావతి: పరిశ్రమల శాఖలో పలువురు జాయింట్‌ డైరెక్టర్‌ (జేడీ) స్థాయి అధికారుల బదిలీకి రంగం సిద్ధమైనట్లు తెలిసింది. ఒకే జిల్లాలో అయిదేళ్లు, అంతకంటే మించి పనిచేస్తున్నవారి పేర్లతో అధికారులు జాబితా సిద్ధం చేశారు. దీన్ని ముఖ్యమంత్రికి పంపినట్లు సమాచారం. అక్కడ నుంచి ఆమోదం రాగానే బదిలీ ఉత్తర్వులు జారీకానున్నాయి. ఈ ప్రక్రియ ఒకటి, రెండు రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏడెనిమిది మంది జేడీలు బదిలీపై వెళ్లాల్సి వస్తుందని తెలిసింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యాలయంలో అయిదేళ్లకు పైగా విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు జేడీలకు బదిలీ తప్పకపోవచ్చన్న ఊహాగానాలు ఆ వర్గాల్లో వినిపిస్తున్నాయి. దీంతోపాటు వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న జేడీలు బదిలీల జాబితాలో ఉన్నారు. ఈ ఏడాది మేలో నిర్వహించిన సాధారణ బదిలీల సమయంలో పరిశ్రమల శాఖ సిబ్బంది కూడా బదిలీకావాల్సి ఉంది. కానీ, ఆఖరు నిమిషంలో బదిలీల దస్త్రాన్ని మంత్రి పరిశీలనకు పంపారు. ఆయన నుంచి ఆమోదం రాకపోవడంతో బదిలీలు ఆగాయి. ప్రస్తుతం పాలనాపరమైన సర్దుబాటులో భాగంగా బదిలీలు చేస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని