14-20 వరకు ఇంధన పొదుపు వారోత్సవాలు
రాష్ట్రంలో డిసెంబరు 14-20 వరకు ఇంధన పొదుపు వారోత్సవాలను నిర్వహించనున్నట్లు ఏపీ ఇంధన సంరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) ఒక ప్రకటనలో తెలిపింది.
అవార్డుల కోసం దరఖాస్తుల ఆహ్వానం
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో డిసెంబరు 14-20 వరకు ఇంధన పొదుపు వారోత్సవాలను నిర్వహించనున్నట్లు ఏపీ ఇంధన సంరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులోభాగంగా ఇంధన పొదుపు చర్యలు పాటించిన పరిశ్రమలు, సంస్థలకు ‘ఇంధన సామర్థ్య అవార్డులు’ అందిస్తామని పేర్కొంది. అవార్డుల కోసం డిసెంబరు 9లోగా దరఖాస్తులు పంపాలని తెలిపింది. ‘ఇంధన పొదుపులో ప్రజలను భాగస్వామ్యం చేయాలన్నదే వారోత్సవాల నిర్వహణ లక్ష్యం. ఇంధన పొదుపు చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించేలా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తాం. ఇంధనపొదుపుపై షార్ట్‌వీడియో పోటీలు ఉంటాయి. కళాశాల విద్యార్థులు, పొదుపు మహిళలకు సదస్సులు నిర్వహిస్తాం. వారోత్సవాలను విజయవంతం చేయడంలో ప్రభుత్వ విభాగాలు, ప్రజలు, ప్రైవేటు సంస్థలు భాగస్వాములు కావాలి. పరిశ్రమలు, భవనాలు, సంస్థలు, థర్మల్ విద్యుత్ ప్లాంట్లు, టెక్స్టైల్, ఎంఎస్ఎంఈలు, పంచాయతీలు, ఆర్టీసీ బస్టాండులు, బస్సు డిపోలు, ఆసుపత్రులు, ప్రభుత్వ భవనాల్లో చేపట్టిన పొదుపు చర్యల ఆధారంగా ఇంధన సామర్థ్య అవార్డులకు పరిశీలిస్తాం’ అని పేర్కొంది. దరఖాస్తు నిబంధనలు www.apsecm.ap.gov.in/seca2022 అందుబాటులో ఉంటాయని తెలిపింది. పూర్తిచేసిన దరఖాస్తులను ఆన్లైన్లో కేటగిరీవారీగా పంపాలని వెల్లడించింది.
పరిశ్రమల కేటగిరీ: థర్మల్ విద్యుత్ ప్లాంట్లు, ఎంఎస్ఎంఈలు,టెక్స్టైల్ పరిశ్రమలు
ces.asci.org.in/survey/application-for-industrial-category-thermal-power-plants/
భవనాల విభాగం: ces.asci.org.in/survey/application-for-buildings-category/
ఇన్స్టిట్యూషన్ కేటగిరీ: ces.asci.org.in/survey/application-for-gram-panchayats/
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyderabad: బామ్మర్ది ఎంత పనిచేశావ్.. డబ్బు కోసం ఇంత బరితెగింపా?
-
Movies News
Raveena Tandon: అక్షయ్‌తో బ్రేకప్.. దాదాపు పాతికేళ్ల తర్వాత పెదవి విప్పిన నటి
-
Politics News
Lok Sabha: ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయకండి : ఉత్తమ్‌కు స్పీకర్ సూచన
-
Sports News
Team India Final XI: గిల్ ఉంటాడా.. సూర్య వస్తాడా.. కీపర్ ఎవరు.. స్పిన్నర్ లెక్కేంటి?
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
India News
Modi: ఆ దశాబ్ద కాలాన్ని మనం కోల్పోయాం.. విపక్షాలపై మోదీ ఫైర్