తిరుమలలో లడ్డూ కౌంటర్ల వద్ద భక్తులకు ఇబ్బందులు

తిరుమలలోని శ్రీవారి లడ్డూ విక్రయ కేంద్రంలో భక్తులు లడ్డూ ప్రసాదం కోసం భారీగా బారులు తీరి ఇబ్బంది పడుతున్నారు.

Published : 29 Nov 2022 03:17 IST

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలోని శ్రీవారి లడ్డూ విక్రయ కేంద్రంలో భక్తులు లడ్డూ ప్రసాదం కోసం భారీగా బారులు తీరి ఇబ్బంది పడుతున్నారు. లడ్డూ ప్రసాదాన్ని అందించేందుకు కేవీఎం సంస్థకు తితిదే కాంట్రాక్ట్‌ను కేటాయించింది. ఆ సంస్థ ఆధ్వర్యంలో దాదాపు 60 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 3 నెలలుగా వేతనాలు చెల్లించలేదని ఆరోపిస్తూ కొంతమంది విధులకు రాకపోవడం, ఆలస్యంగా వస్తున్నారు. దీంతో సంస్థ సిబ్బందిని పూర్తిగా విధుల్లోకి రాకుండా తితిదే ఉన్నతాధికారులు నిలిపివేశారు. వారి స్థానంలో తితిదే శాశ్వత ఉద్యోగులు, శ్రీవారి సేవకులతో లడ్డూ కౌంటర్ల నిర్వహణను చేపట్టారు. వారికి విధుల నిర్వహణపై పూర్తిస్థాయి నైపుణ్యం లేకపోవడంతో సోమవారం భక్తులకు ఆలస్యంగా లడ్డూలను అందించారు. 

* శ్రీవారి దర్శనానికి దాదాపు 30 గంటల సమయం పడుతుందని తితిదే తెలిపింది. సోమవారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి టీబీసీ వరకు భక్తులు వేచి ఉన్నారు. 

5న తిరుమలకు రాష్ట్రపతి రాక?

తిరుమల, మహిళా వర్సిటీ, న్యూస్‌టుడే: శ్రీవారి దర్శనార్థం డిసెంబరు 5న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరుమల రానున్నట్లు తెలిసింది. అదేరోజు తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీకి వెళ్లనున్నట్లు సమాచారం. 20 నిమిషాల పాటు విద్యార్థినులతో పలు అంశాలపై ముచ్చటించనున్నట్లు తెలిసింది.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు