ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పెరగనున్న పీజీ సీట్లు
రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యకళాశాలల్లో అదనంగా పీజీ వైద్యవిద్య సీట్లు పెంచేందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు రూ.453.6 కోట్లు ఆర్థికసాయం చేసేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ అనుమతించినట్లు అండర్ సెక్రటరీ చందనకుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపారు.
630 సీట్ల పెంపునకు కేంద్ర ఆరోగ్యశాఖ అనుమతి
వసతుల కల్పనకు రూ.453.6 కోట్ల సాయం
గుంటూరు వైద్యం, న్యూస్టుడే: రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యకళాశాలల్లో అదనంగా పీజీ వైద్యవిద్య సీట్లు పెంచేందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు రూ.453.6 కోట్లు ఆర్థికసాయం చేసేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ అనుమతించినట్లు అండర్ సెక్రటరీ చందనకుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపారు. వచ్చే విద్యా సంవత్సరం(2023-24)లో రాష్ట్రవ్యాప్తంగా 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 688 సీట్ల పెంపు కోసం ప్రతిపాదనలు పంపగా, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ (సీఎస్ఎస్) రెండోదశ కింద 630 సీట్ల పెంపునకు అనుమతించినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఒక్కో పీజీ సీటుకు రూ.1.20 కోట్ల వంతున ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ.756 కోట్లకు అనుమతి మంజూరుచేసినట్లు తెలిపారు. ఇందులో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో వెచ్చించాలి. కేంద్రం తన వాటాగా రూ.453.6 కోట్లు భరించనున్నట్లు తెలిపారు.
కళాశాలలు.. సీట్ల వివరాలు
రాష్ట్రంలోని 11 ప్రభుత్వ వైద్యకళాశాలల్లో పీజీ సీట్లు పెంచేందుకు అనుమతించిన వివరాలివే.. కేఎంసీ కర్నూలు-41, జీఎంసీ అనంతపురం-65, జీఎంసీ కడప-69, ఎస్వీ వైద్యకళాశాల తిరుపతి-75, జీఎంసీ ఒంగోలు-79, ఏసీఎస్ఆర్ జీఎంసీ నెల్లూరు-5, జీఎంసీ గుంటూరు-34, ఎస్ఎంసీ విజయవాడ-71, ఆర్ఎంసీ కాకినాడ-46, ఏఎంసీ విశాఖపట్నం-128, జీఎంసీ శ్రీకాకుళం-17 కలిపి మొత్తం 630 సీట్లకు ఆర్థికసాయం చేసేందుకు అనుమతించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TS High court: భారాస ఎంపీ నామా నాగేశ్వరరావుపై మనీలాండరింగ్ కేసులో యథాతథస్థితి
-
Sports News
DK: విహారీ.. ఏమా షాట్..? అది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: డీకే
-
World News
కంటి చుక్కలతో అమెరికాలో మరణం.. ఆ మందులను రీకాల్ చేసిన భారత కంపెనీ
-
Politics News
Kichha Sudeep: కిచ్చా సుదీప్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా?
-
General News
AP-Telangana: తెలుగు రాష్ట్రాలకు రైల్వే బడ్జెట్లో రూ.12,800 కోట్లు: అశ్విని వైష్ణవ్
-
General News
Andhra News: కోర్టు ఉత్తర్వులంటే లెక్కలేదా?.. ఏమవుతుందిలే అని బరితెగింపా?: ఏపీ హైకోర్టు