మరో సలహాదారు నియామకం

‘సలహాదారులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారు.

Published : 29 Nov 2022 03:27 IST

పంచాయతీరాజ్‌శాఖకు నాగార్జునరెడ్డి

ఈనాడు, అమరావతి: ‘సలహాదారులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారు. మంత్రులకు సలహాదారుల్ని నియమిస్తే అర్థం చేసుకోగలం గానీ, ప్రభుత్వశాఖలకు సలహాదారులేంటి? ఇలా వదిలేస్తే రేపు అడ్వకేట్‌ జనరల్‌కీ ఓ సలహాదారుని నియమిస్తారు’- ఇవి జ్వాలాపురపు శ్రీకాంత్‌ను దేవాదాయశాఖ సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులపై స్టే ఇస్తూ కొన్నాళ్ల క్రితం హైకోర్టు చేసిన వ్యాఖ్యలు. ఎవరేం చెప్పినా ప్రభుత్వానికి లెక్కలేదు. హైకోర్టే మొట్టికాయలు వేసినా చీమకుట్టినట్టూ లేదు. హైకోర్టు వ్యాఖ్యల్ని, వివిధ వర్గాల నుంచి వస్తున్న విమర్శల్నీ బేఖాతరు చేస్తూ సలహాదారుల నియామక పరంపరను కొనసాగిస్తోంది. తాజాగా సోమవారం మరో సలహాదారుని నియమించింది. కొత్తగా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు పోతిరెడ్డి నాగార్జునరెడ్డిని సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆయన రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగుతారని వెల్లడించింది. వైకాపా మద్దతుదారులకు, అనుయాయులకు పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం ఎడాపెడా సలహాదారుల్ని నియమిస్తోంది. ఇప్పటికే సలహాదారుల సంఖ్య అర్ధసెంచరీ దాటేయగా, ఎప్పటికప్పుడు ఆ జాబితాలో మరింత మంది చేరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని