వివేకా హత్య కేసు దర్యాప్తు బదిలీపై నేడు తీర్పు

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు బదిలీపై నేడు తీర్పు ఇవ్వనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది.

Updated : 29 Nov 2022 05:16 IST

సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ

ఈనాడు, దిల్లీ: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు బదిలీపై నేడు తీర్పు ఇవ్వనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. వివేకా హత్యకేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిలు రద్దు కోరుతూ సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్‌ దాఖలుచేసింది. జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ సీటీ రవికుమార్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుటకు సోమవారం ఈ పిటిషన్‌ విచారణకు వచ్చింది. వివేకా హత్య కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ ఆయన కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ విచారణలో తీర్పు వెలువరించాల్సి ఉందని ధర్మాసనం గుర్తుచేసింది. మంగళవారం తీర్పు వెల్లడిస్తామని జస్టిస్‌ ఎం.ఆర్‌.షా తెలిపారు. గంగిరెడ్డి కేసును శుక్రవారం (డిసెంబరు 2న) విచారిస్తామన్నారు. గంగిరెడ్డి తరఫు సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు సోమవారమే విచారణ చేపట్టాలని కోరినా.. ధర్మాసనం శుక్రవారం చేపడతామంటూ వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని