సీడబ్ల్యూసీ కొత్త ఛైర్మన్‌గా చంద్రశేఖర్‌ అయ్యర్‌

పోలవరం ప్రాజెక్టు అథారిటీ సి.ఇ.ఒ.గా ఉన్న చంద్రశేఖర్‌ అయ్యర్‌ డిసెంబరు 1 నుంచి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ఛైర్మన్‌గా బాధ్యతలు చేపడతారు.

Updated : 29 Nov 2022 06:05 IST

పదవిలో కొనసాగేది నెల రోజులే

ఈనాడు, హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టు అథారిటీ సి.ఇ.ఒ.గా ఉన్న చంద్రశేఖర్‌ అయ్యర్‌ డిసెంబరు 1 నుంచి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ఛైర్మన్‌గా బాధ్యతలు చేపడతారు. నెల రోజులే ఆయన ఈ పదవిలో ఉంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి. జనవరి 1 నుంచి కుస్విందర్‌ ఓహ్రా సీడబ్ల్యూసీ కొత్త ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడినట్లు తెలిసింది. ప్రస్తుత ఛైర్మన్‌ ఆర్‌.కె.గుప్తా ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని