హస్తకళల కళాకారులకు జాతీయ పురస్కారాలు

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామానికి చెందిన తోలుబొమ్మల కళాకారులు దళవాయి శివమ్మ, ఆమె కుమారుడు కుళ్లాయప్ప జాతీయ అవార్డులు అందుకున్నారు.

Published : 29 Nov 2022 03:33 IST

నిమ్మలకుంట తోలుబొమ్మల కళాకారులకు గుర్తింపు

ధర్మవరం, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామానికి చెందిన తోలుబొమ్మల కళాకారులు దళవాయి శివమ్మ, ఆమె కుమారుడు కుళ్లాయప్ప జాతీయ అవార్డులు అందుకున్నారు. సోమవారం దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ చేతుల మీదుగా పురస్కారాలను స్వీకరించారు. లెదర్‌ పప్పెట్‌ విభాగంలో జాతీయ స్థాయి అవార్డు 2017 సంవత్సరానికి దళవాయి కుళ్లాయప్ప, 2019కి దళవాయి శివమ్మ ఎంపికయ్యారు. తోలుపై మహావిష్ణువు చరితామృతం రూపొందించి కుళ్లాయప్ప అవార్డు పొందారు. దళవాయి శివమ్మ తోలుపై రూపొందించిన రామరావణ యుద్ధ ఘట్టం పురస్కారానికి ఎంపికైంది.

శ్రీకాళహస్తి కళాకారునికి ‘శిల్పగురు’ అవార్డు

శ్రీకాళహస్తి: కలంకారీలో అద్భుత ప్రతిభను చాటిన కళాకారులకు ఇచ్చే శిల్పగురు పురస్కారాన్ని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి కళాకారుడు వేలాయుధం శ్రీనివాసులరెడ్డి అందుకున్నారు. ఇదే కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్‌ధన్‌ఖడ్‌ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని స్వీకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని