Andhra News: పడిన ఇబ్బందులు చాలు.. వైకాపా ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డికి గ్రామస్థుడి ఝలక్‌

నెల్లూరు జిల్లా కందుకూరు మండలం ఓగూరులో స్థానిక ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది.

Updated : 29 Nov 2022 07:25 IST

కందుకూరు గ్రామీణం, న్యూస్‌టుడే: నెల్లూరు జిల్లా కందుకూరు మండలం ఓగూరులో స్థానిక ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సోమవారం గ్రామంలో ‘గడపగడపకు మన ప్రభుత్వం’లో ఎమ్మెల్యేతో కలసి ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాల అమలుపై గ్రామస్థుడు పి.రఘు ఎమ్మెల్యే ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

‘పథకం సరిగా వస్తే సరే.. లేదంటే అవసరం లేదు’ అంటూ తన ఇంటి గేటు వేసుకున్నారు. ‘నీకు ప్రభుత్వ పథకాలు అవసరం లేదా?’ అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ‘మీ ద్వారా మేము పడిన ఇబ్బంది చాలు’ అని ఆయన బదులిచ్చారు. ‘ఇబ్బంది పడి ఉంటే మంచిది’ అంటూ ఎమ్మెల్యే అక్కడినుంచి వెళ్లిపోయారు. తన భర్త చనిపోయినా తనకు పింఛను రావటం లేదని ధన్యాసి గోవిందమ్మ వివరించారు. రైతుభరోసా అందటం లేదన్నారు. భర్త మరణించినా ఆయన పేరుతో బియ్యం తీసుకుంటున్నారని, అందువల్లే పింఛను రాలేదని ఎమ్మెల్యేకు సిబ్బంది వివరించారు. అమ్మఒడి మూడో విడత నిధులు ఇవ్వలేదని, ఇచ్చినట్లు దస్త్రాల్లో ఉందని గ్రామస్థుడు వై.మల్లికార్జున పేర్కొన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు