వేడుకగా పద్మావతీ అమ్మవారి పంచమి తీర్థం

తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి పంచమి తీర్థం సోమవారం వైభవంగా జరిగింది. కార్తిక బ్రహోత్సవాల్లో చివరగా జరిగే పంచమి తీర్థం రోజున చక్రస్నానంతో కలిసి పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తారు.

Published : 29 Nov 2022 03:44 IST

తిరుచానూరు, న్యూస్‌టుడే: తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి పంచమి తీర్థం సోమవారం వైభవంగా జరిగింది. కార్తిక బ్రహోత్సవాల్లో చివరగా జరిగే పంచమి తీర్థం రోజున చక్రస్నానంతో కలిసి పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తారు. అలమేలుమంగ జన్మించిన పద్మ సరోవరంలోనే చక్రస్నానం నిర్వహించడం ఆనవాయితీ. ఇందుకోసం సారెను తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తిరుచానూరు వరకు కాలినడకన ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆలయంలో రాత్రి జరిగిన ధ్వజావరోహణంతో కార్తిక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. కార్యక్రమంలో తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈవో వీరబ్రహ్మం, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు