మైనారిటీ నాయకుల అరెస్టు

అధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు గుంటూరు కలెక్టరేట్‌కు వచ్చిన తెదేపా మైనారిటీ నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేయడం సోమవారం ఉద్రిక్తతకు దారి తీసింది.

Published : 29 Nov 2022 04:54 IST

గుంటూరు కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్తత

గుంటూరు (కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: అధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు గుంటూరు కలెక్టరేట్‌కు వచ్చిన తెదేపా మైనారిటీ నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేయడం సోమవారం ఉద్రిక్తతకు దారి తీసింది. ఇటీవల నరసాపురంలో సీఎం సభకు వచ్చిన ముస్లిం మహిళలను బురఖా తొలగించాకే అనుమతించడంపై నిరసనగా మైనారిటీ నాయకులు కలెక్టరేట్‌లో వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కలెక్టరేట్‌కు వచ్చిన తెదేపా మైనారిటీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించే స్పందన కార్యక్రమం వద్దకు వెళ్లకుండా అరెస్టు చేశారు. కేవలం వినతిపత్రం ఇచ్చేందుకేనని చెప్పినా పోలీసులు వారిని బలవంతంగా వాహనంలోకి ఎక్కించారు. గుంటూరు పార్లమెంటు తెదేపా అధ్యక్షుడు గని, మహిళా ప్రధాన కార్యదర్శి రిజ్వానా, రాష్ట్ర కమిటీ సభ్యులు బాజీ, కరీముల్లా, మోసిన్‌, అఫ్జల్‌, జమీర్‌, జానీబేగం తదితరులను అరెస్టు చేశారు. గుంటూరు అరండల్‌పేట స్టేషన్‌కు కొందరిని, నల్లపాడు స్టేషన్‌కు మరికొందరిని తరలించారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని