న్యాయమూర్తుల బదిలీలపై కొనసాగిన నిరసన

హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టు దేవానంద్‌, జస్టిస్‌ డి.రమేశ్‌ల బదిలీలను నిలిపివేయాలని న్యాయవాదులు డిమాండ్‌ చేశారు.

Published : 30 Nov 2022 04:52 IST

ఈనాడు, అమరావతి: హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టు దేవానంద్‌, జస్టిస్‌ డి.రమేశ్‌ల బదిలీలను నిలిపివేయాలని న్యాయవాదులు డిమాండ్‌ చేశారు. మంగళవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో హైకోర్టు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏపీ అడ్వకేట్స్‌ ఐకాస కన్వీనర్లు వై.కోటేశ్వరరావు (వైకే), జడ శ్రావణ్‌ కుమార్‌, డీఎస్‌ఎన్వీ ప్రసాదబాబు, జీవీ శివాజీ, బార్‌ కౌన్సిల్‌ సభ్యులు సుంకర రాజేంద్ర ప్రసాద్‌, చలసాని అజయ్‌ కుమార్‌, న్యాయవాదులు గూడపాటి లక్ష్మీనారాయణ, పి.నాగరాజు తదితరుల ఆధ్వర్యంలో హైకోర్టు వద్ద నినాదాలు చేశారు. బదిలీలను నిలిపివేయాలని కోరారు. అనంతరం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రను కలిసి వినతి సమర్పించారు. సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించేలా విజ్ఞప్తి చేయాలని కోరారు.

కొలీజియానికి బార్‌ కౌన్సిల్‌ విజ్ఞప్తి: ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టు దేవానంద్‌, జస్టిస్‌ రమేశ్‌ల బదిలీలపై పునరాలోచించాలని ఏపీ బార్‌ కౌన్సిల్‌.. సుప్రీంకోర్టు కొలీజియానికి విజ్ఞప్తి చేసింది. వారిరువురినీ ఏపీ హైకోర్టులోనే కొనసాగించాలని కోరింది. మరోవైపు కోర్టు విధులకు ఆటంకం కలిగించవద్దని న్యాయవాదులకు విజ్ఞప్తి చేసింది. ఈనెల 28న వర్చువల్‌ విధానంలో నిర్వహించిన సమావేశంలో మెజారిటీ సభ్యులు ఈ మేరకు తీర్మానం చేసినట్లు ఏపీ బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ గంటా రామారావు తెలిపారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు