జపాన్‌ బ్యాంకుతో ఏపీఈడీబీ ఒప్పందం

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపే జపాన్‌, తూర్పు ఆసియా దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలకు జపాన్‌కు చెందిన ఎంయూఎఫ్‌జీ బ్యాంకు ఆర్థిక సహకారాన్ని అందిస్తుందని రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి బోర్డు (ఏపీఈడీబీ) సీఈవో సృజన ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 30 Nov 2022 05:38 IST

ఈనాడు-అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపే జపాన్‌, తూర్పు ఆసియా దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలకు జపాన్‌కు చెందిన ఎంయూఎఫ్‌జీ బ్యాంకు ఆర్థిక సహకారాన్ని అందిస్తుందని రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి బోర్డు (ఏపీఈడీబీ) సీఈవో సృజన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అవగాహన ఒప్పందంపై ఏపీఈడీబీ, బ్యాంకు ప్రతినిధులు మంగళవారం సంతకాలు చేసినట్లు పేర్కొన్నారు. ‘‘ఈ ఒప్పందం ద్వారా ఎంయూఎఫ్‌జీ బ్యాంకు సహకారంతో రాష్ట్రానికి పునరుత్పాదక ప్రాజెక్టులు, ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీ, ఫార్మా, లాజిస్టిక్‌ రంగాల్లో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి అనువైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. ఇప్పటికే సుమారు జపాన్‌కు చెందిన 25 కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. విశాఖలో వచ్చే ఏడాది మార్చి 3, 4 తేదీల్లో నిర్వహిస్తున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సదస్సు-2023ను పురస్కరించుకుని జపాన్‌లో రోడ్‌షోలు నిర్వహించాలని భావిస్తున్నాం...’’ అని సీఈవో సృజన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని