కేంద్రంతో ఒప్పందం చేసుకోనున్నాం

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ సీట్ల పెంపునకు కేంద్రం అనుమతినిచ్చిన నేపథ్యంలో వైద్య కళాశాలల తరఫున ఒప్పందాన్ని చేసుకోబోతున్నట్లు డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ తెలిపారు.

Published : 30 Nov 2022 05:38 IST

ఈనాడు-అమరావతి: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ సీట్ల పెంపునకు కేంద్రం అనుమతినిచ్చిన నేపథ్యంలో వైద్య కళాశాలల తరఫున ఒప్పందాన్ని చేసుకోబోతున్నట్లు డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 688 సీట్ల పెంపునకు వీలుగా ప్రతిపాదనలు పంపగా... 631 సీట్లకు అనుమతి లభించిందన్నారు. కళాశాలల తరఫున కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖతో ఒప్పందాన్ని చేసుకుంటే రావాల్సిన రూ.453.6 కోట్లలో 60% దశల వారీగా మంజూరు అవుతుందని వెల్లడించారు. మిగిలిన 40% రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంటుందన్నారు. ఈ నిధులతో కళాశాలల్లో చదివే విద్యార్థులకు అవసరమైన వసతి గృహాలు, యూనిట్లలో అవసరమైన పరికరాలు, నిర్మాణాలు జరుపుతామని తెలిపారు. వీటిపై ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. వీటి పురోగతి అనుసరించి సీట్లు మంజూరు అవుతాయని తెలిపారు.

ప్రభుత్వ పరిశీలనలో రిక్రూట్‌మెంట్‌ బోర్డు!

వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలకు ప్రత్యేకంగా రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని డాక్టర్‌ వినోద్‌కుమార్‌ తెలిపారు. ముఖ్య కార్యదర్శి ఛైర్మన్‌గా, సబ్‌ కలెక్టర్‌/డిప్యూటీ డైరెక్టర్‌ హోదాలో ఉన్న వారు కార్యదర్శిగా వ్యవహరిస్తారని చెప్పారు. ఇతర విభాగాలకు చెందిన కొందరు అధికారులతో రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు అవుతుందన్నారు. తమిళనాడులో ప్రత్యేకంగా ఉన్న రిక్రూట్‌మెంట్‌ బోర్డు పనితీరు అధ్యయనం చేసినట్లు చెప్పారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు