CM Jagan: డబ్బులు వేశాం.. మీరు ఫీజులు కట్టేయండి
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని ముఖ్యమంత్రి జగన్ ఆరోపించారు.
విద్యా, వసతి దీవెనలకు రూ.12,401 కోట్లు ఖర్చు చేశాం
ఈ మార్పును చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకున్నాయి
అమరావతిలో పేదలకు స్థలాలు ఇస్తామంటే అడ్డుపడుతున్నాయి
ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తుండదు
మదనపల్లె సభలో సీఎం జగన్
ఈనాడు డిజిటల్, కడప: అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని ముఖ్యమంత్రి జగన్ ఆరోపించారు. ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు జరుగుతున్న లబ్ధిని చూసి ఓర్వలేకపోతున్నాయని మండిపడ్డారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బుధవారం జగనన్న విద్యా దీవెన పథకం కింద రూ.694 కోట్ల విడుదల సందర్భంగా జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ... ‘3,648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో ప్రతి జిల్లా, నియోజకవర్గంలోనూ సమస్యలను చూశా. ప్రజలు చెప్పిన గాథలను చెవులారా విన్నా. ఆ రోజు నేను చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. అధికారంలోకి రాగానే మన ప్రభుత్వం పేదరిక పరిస్థితులను మార్చేదిశగా అడుగులు వేస్తోంది. విద్యా వ్యవస్థలోనూ సమూల సంస్కరణలు తీసుకొచ్చాం. బోధనా రుసుములకు పూర్తి రీయింబర్స్మెంట్ అమలు చేస్తున్నాం. మూడున్నరేళ్లుగా విద్యాదీవెన కింద రూ.9,052 కోట్లు, వసతి దీవెన కింద రూ.3,349 కోట్లు కలిపి రూ.12,401 కోట్లు ఖర్చు చేశాం. తాజాగా... జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలలకు 11.02 లక్షల మంది విద్యార్థులకు రూ.694 కోట్లను నేరుగా వారి తల్లుల ఖాతాల్లోనే జమ చేస్తున్నాం. ఈ డబ్బులు తీసుకెళ్లి వారం, పది రోజుల్లో కళాశాలల్లో ఫీజుల కింద కట్టేయండి. విద్యారంగాన్ని ఉపాధికి చేరువలో తీసుకుపోతూ... డిగ్రీ చదువులతోపాటు ఇంటర్న్‌షిప్ కోర్సులను ప్రవేశపెట్టాం. ఆన్లైన్లో మంచి కోర్సులు ఎక్కడున్నాయో వెతికిపట్టుకున్నాం. వాటిని పిల్లలకు నేర్పిస్తూ.. వాటికి క్రెడిట్ ట్రాన్స్ఫర్ కింద అనుమతులిస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో ప్రాంగణ ఎంపికల్లో 37వేల మందికే ఉద్యోగాలొచ్చాయి. మేం తీసుకున్న చొరవతో నిరుడు ఏకంగా 85వేల మందికి అవకాశాలు లభించాయి. అక్షరాలు రాయడం, చదవడమే విద్యకు పరమార్థం కాదు. తనకు తానుగా ప్రతి చిన్నారి ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలిగే శక్తిని ఇవ్వగలగడమే విద్యకు పరమార్థం.. అని ప్రపంచ ప్రఖ్యాత ఫిజిసిస్ట్ ఆల్బర్ట్ ఐన్‌స్టైన్ చక్కగా వర్ణించారు’ అని ప్రస్తావించారు.
జగనన్నకు తోడుగా ఉండండి
‘ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు ఉండదు. ప్రజలతో మాత్రమే పొత్తు పెట్టుకుంటాం. రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు ఆలోచనా శక్తిని, వివేకాన్ని ప్రసాదించాలని భగవంతున్ని కోరుతున్నా. మానవతా వాదంతో కూడిన జ్ఞానం వీరందరికీ రావాలని వేడుకుంటున్నా. ఫలానా ప్రాంతంలో, పొలాల్లో, ఊహించిన రేటుకు భూములను అమ్ముకునేందుకే రాజధాని కట్టాలన్న ఆలోచన నుంచి బయటపడేలా వీరికి బుద్ధి ప్రసాదించాలని కోరాల్సి వస్తోంది. బటన్ నొక్కితే మన రాష్ట్రం శ్రీలంక అయిపోతుందట! వీళ్లు అధికారంలో ఉన్నప్పుడు అమెరికాలా ఉండిందట! మాపై విష ప్రచారం చేస్తున్న చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడి మాటలను నమ్మొద్దు. మీ ఇంటికి మంచి జరిగిందా? లేదా? అన్నదే కొలమానంగా తీసుకోండి. మంచి జరిగి ఉంటే జగనన్నకు తోడుగా ఉండండి. ఈ ప్రభుత్వాన్ని దేవుడు ఆశీర్వదించాలి. మీ అందరి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలి’ అని జగన్ ఆకాంక్షించారు. సభకు ముందు మదనపల్లెలో కొంత దూరం రోడ్ షో నిర్వహించారు. సభలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మేరుగు నాగార్జున, ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, నవాజ్‌బాషా, కలెక్టర్ గిరీష, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Video: ట్రాలీబ్యాగ్‌లో రూ.64లక్షల విలువైన విదేశీ కరెన్సీ తరలింపు.. ఎలా బయటకు లాగారో చూడండి!
-
India News
Indian Railways: ముంబయి- అహ్మదాబాద్ రైలు మార్గం.. 622 కి.మీల మేర కంచె నిర్మాణం!
-
Sports News
IND vs NZ: ‘వంద’ కోసం చెమటోడ్చిన టీమ్ఇండియా.. రెండో టీ20లో విజయం
-
Movies News
Harish Shankar: అందుకే ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ అప్డేట్లు ఇవ్వను: హరీశ్‌శంకర్ కామెంట్స్ వైరల్
-
General News
Sajjanar: అలాంటి సంస్థలకు ప్రచారం చేయొద్దు: సెలబ్రిటీలకు సజ్జనార్ సలహా
-
General News
CM Jagan: రెండ్రోజుల పాటు సీఎం జగన్ దిల్లీ పర్యటన