సర్పంచులంటే ప్రభుత్వానికి భయం

సర్పంచులను చూసి రాష్ట్ర ప్రభుత్వం భయపడుతోందని ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు బాబూ రాజేంద్రప్రసాద్‌ విమర్శించారు.

Published : 01 Dec 2022 04:29 IST

బాబూ రాజేంద్రప్రసాద్‌

తిరుపతి (గాంధీరోడ్డు), న్యూస్‌టుడే: సర్పంచులను చూసి రాష్ట్ర ప్రభుత్వం భయపడుతోందని ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు బాబూ రాజేంద్రప్రసాద్‌ విమర్శించారు. తిరుపతిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అలిపిరి వద్ద సర్పంచులు చేపట్టిన సమర శంఖారావానికి సాధారణ భక్తుల్లాగా కాలినడకన తిరుమలకు వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకోవడం సమంజసమా అని ప్రశ్నించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా పోలీసులు అరెస్టు చేయడంపై తితిదే, పీఠాధిపతులు, హిందూధర్మాన్ని పరిరక్షించే భాజపా స్పందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటంకం కలిగించినా 60 మంది సర్పంచులు, రాష్ట్ర నాయకులు శ్రీవారిని దర్శించుకుని సమర శంఖారావం పూరించారని వివరించారు. అనంతరం ఏపీ సర్పంచుల సంఘం అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీముత్యాలరావు మాట్లాడుతూ.. మహిళలనీ చూడకుండా పురుష పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమని వ్యాఖ్యానించారు. సమావేశంలో ఛాంబర్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగంశెట్టి సుబ్బరామయ్య (తిరుపతి), మునిరెడ్డి (కడప), కార్యదర్శి బొర్రా నాగరాజు (అరకు), నాయకులు ప్రతాప్‌రెడ్డి (కర్నూలు), కొండారెడ్డి (జమ్మలమడుగు), శ్రీనివాస యాదవ్‌, మునీష్‌, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు