అర్హులకు పథకాలు అందడం లేదు

అర్హత ఉన్నప్పటికీ పలువురికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు డీఆర్‌సీ (జిల్లా సమీక్షా మండలి) సమావేశం దృష్టికి తీసుకొచ్చారు.

Published : 01 Dec 2022 04:29 IST

ఏలూరు డీఆర్‌సీలో గళమెత్తిన వైకాపా ఎమ్మెల్యేలు

ఏలూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: అర్హత ఉన్నప్పటికీ పలువురికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు డీఆర్‌సీ (జిల్లా సమీక్షా మండలి) సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. రవాణాశాఖ మంత్రి, ఏలూరు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పినిపే విశ్వరూప్‌ అధ్యక్షతన ఏలూరు కలెక్టరేట్‌లో బుధవారం డీఆర్‌సీ సమావేశం నిర్వహించారు. జిల్లాల పునర్విభజన తర్వాత తొలిసారి జరిగిన ఈ సమావేశంలో వైకాపా ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలను ఏకరవు పెట్టారు. మొత్తం 7 నియోజకవర్గాలకు చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా మినహా మిగిలిన శాసన సభ్యులు హాజరయ్యారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలైన విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి, వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ, వైఎస్‌ఆర్‌ పింఛను కానుక పథకాల వర్తింపులో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, పలు నిబంధనలతో అర్హులైన్పటికీ ఫలాలు అందడం లేదని వివరించారు. మంత్రి పినిపే విశ్వరూప్‌ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏలూరు, దెందులూరు, పోలవరం, ఉంగుటూరు, నూజివీడు, కైకలూరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, కొఠారు అబ్బయ్య చౌదరి, తెల్లం బాలరాజు, పుప్పాల వాసుబాబు, మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు, దూలం నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని