నిరుపేదలందరికీ సంక్షేమ ఫలాలు అందేలా కృషి

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు మారుమూల పల్లెల్లో ఉండే వారికి, నిరుపేదలందరికీ  అందేలా ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపిస్తానని ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 01 Dec 2022 04:29 IST

బాధ్యతల స్వీకరణ సందర్భంగా సీఎస్‌ జవహర్‌రెడ్డి

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు మారుమూల పల్లెల్లో ఉండే వారికి, నిరుపేదలందరికీ  అందేలా ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపిస్తానని ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం సచివాలయంలో సమీర్‌ శర్మ నుంచి ఆయన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏ ఉద్దేశంతో కార్యక్రమాలు అమలు చేస్తోందో, అవి నూరు శాతం అమలయ్యేలా చూసేందుకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం వివిధశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, తదితరులు జవహర్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు విజయవాడ దుర్గ గుడి, భద్రాచలం రామాలయ వేద పండితులు మంత్రోచ్చారణతో నూతన సీఎస్‌ను ఆశీర్వదించారు.

మెరుగైన సేవలందించిన సమీర్‌ శర్మ

సమీర్‌శర్మ రాష్ట్రానికి మెరుగైన సేవలు అందించారని జవహర్‌రెడ్డి కొనియాడారు. సీఎస్‌గా సమీర్‌ శర్మ పదవీ విరమణ, నూతన సీఎస్‌గా జవహర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ సందర్భంగా సచివాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. జవహర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగులకు సమీర్‌ శర్మ మార్గదర్శకుడిగా నిలిచారని తెలిపారు. సమీర్‌ శర్మ మాట్లాడుతూ.. 40 ఏళ్లపాటు వివిధ హోదాల్లో అందించిన సేవలు సంతృప్తిని ఇచ్చాయని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని