తిరుపతిలో శ్రీవాణి ట్రస్టు టికెట్ల కేంద్రం

శ్రీవారి దర్శనం కోసం శ్రీవాణి ట్రస్టు ఆఫ్‌లైన్‌ టికెట్లను తిరుపతిలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తితిదే జేఈవో వీరబ్రహ్మం తెలిపారు.

Published : 01 Dec 2022 04:29 IST

తిరుపతి (గాంధీ రోడ్డు), న్యూస్‌టుడే: శ్రీవారి దర్శనం కోసం శ్రీవాణి ట్రస్టు ఆఫ్‌లైన్‌ టికెట్లను తిరుపతిలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తితిదే జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. మాధవం అతిథి గృహంలో ఏర్పాటు చేసిన ఈ కౌంటర్లను బుధవారం జేఈవో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీవాణి ట్రస్టుకు రూ.10వేల విరాళం ఇచ్చి రూ.500 చెల్లించే భక్తులకు ఇప్పటిదాకా తిరుమలలో ఆఫ్‌లైన్‌ టికెట్లు జారీ చేశామని, ఈ ప్రక్రియలో దాతల ఇబ్బందులను గుర్తించి తితిదే శ్రీవాణి ట్రస్టు ఆఫ్‌లైన్‌ టికెట్లను తిరుపతిలోనే జారీ చేసే ఏర్పాట్లు చేసిందని తెలిపారు. 

* శ్రీవారి సర్వ దర్శనానికి తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య అధికంగా ఉంది. బుధవారం సాయంత్రానికి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా సర్వ దర్శనానికి క్యూలైన్లలో వచ్చిన భక్తులకు 24 గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుందని తితిదే తెలిపింది.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని