Bhadrachalam: ఆన్లైన్లో వైకుంఠద్వార దర్శన టికెట్లు
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఈ నెల 23 నుంచి శ్రీవైకుంఠ ఏకాదశి మహోత్సవాలను నిర్వహించనున్నారు.
భద్రాద్రి జిల్లాలో ఐదు కౌంటర్ల ఏర్పాటు
భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఈ నెల 23 నుంచి శ్రీవైకుంఠ ఏకాదశి మహోత్సవాలను నిర్వహించనున్నారు. ఇందులో 2023 జనవరి 1న గోదావరిలో తెప్పోత్సవం ఉంటుంది. 2న ఉదయం నిర్వహించే ఉత్తర(వైకుంఠ) ద్వార దర్శన పూజలను ప్రత్యక్షంగా వీక్షించే వారి కోసం సెక్టార్లను సిద్ధం చేసి వీటి టికెట్లను విక్రయించనున్నారు. నేటి నుంచి రూ.2వేలు, రూ.వెయ్యి, రూ.500, రూ.250ల టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని భద్రాచలం రామాలయ కార్యనిర్వహణాధికారి శివాజీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. www.bhadrachalamonline.com వెబ్సైట్ ద్వారా భక్తులు వీటిని పొందవచ్చని చెప్పారు. భద్రాద్రి జిల్లా పరిధిలోని కొత్తగూడెం, భద్రాచలం ఆర్డీవో కార్యాలయాలు, రామాలయంలోని ప్రధాన కౌంటర్, తానీషా కల్యాణ మండపం, బ్రిడ్జి వద్ద ఉన్న రామాలయ సమాచార కౌంటర్లో ఈ టికెట్లు నేరుగా విక్రయించనున్నట్లు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Telugu Movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
-
Sports News
IND vs NZ: చాహల్ విషయంలో హార్దిక్ నిర్ణయం సరైంది కాదు: గంభీర్
-
World News
Pakistan: మసీదులో బాంబు పేలుడు.. 28మంది మృతి, 150మందికి గాయాలు
-
General News
TS HighCourt: తొలగిన ప్రతిష్టంభన... గవర్నర్ ప్రసంగంతోనే బడ్జెట్ సమావేశాలు
-
Movies News
Social Look: సోలోగా సదా.. క్యూట్‌గా ఐశ్వర్య.. గులాబీలతో నభా!
-
World News
Imran Khan: ఒకే ఒక్కడు.. ఏకంగా 33 స్థానాల్లో ఇమ్రాన్ ఖాన్ పోటీ