రవాణా రంగ సమస్యలపై 15 నుంచి పోరుబాట

కరోనా ప్రభావంతో రవాణా రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని, దీనిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన 40 లక్షల మంది సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందని పలువురు విమర్శించారు.

Published : 01 Dec 2022 04:29 IST

లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ తీర్మానం

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: కరోనా ప్రభావంతో రవాణా రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని, దీనిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన 40 లక్షల మంది సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందని పలువురు విమర్శించారు. ది ఆంధ్రప్రదేశ్‌ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో విజయవాడలోని అసోసియేషన్‌ హాలులో బుధవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెల 15వ తేదీ నుంచి లోడింగ్‌, అన్‌లోడింగ్‌ చేసేందుకు మామూళ్లు, గుమాస్తా రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదని తీర్మానించారు. అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పి.గోపాలనాయుడు, సంఘం ప్రధాన కార్యదర్శి వై.వి.ఈశ్వరరావు, స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు చెన్నుపాటి వజీర్‌, సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని