ముత్యాలరాజు హాజరుకు హైకోర్టు ఆదేశం

కోర్టు ధిక్కరణ కేసులో పశ్చిమ గోదావరి జిల్లా పూర్వ కలెక్టరు, సీఎం అదనపు కార్యదర్శి రేవు ముత్యాలరాజు హాజరుకు హైకోర్టు బుధవారం ఆదేశాలిచ్చింది.

Published : 01 Dec 2022 04:29 IST

ఈనాడు, అమరావతి: కోర్టు ధిక్కరణ కేసులో పశ్చిమ గోదావరి జిల్లా పూర్వ కలెక్టరు, సీఎం అదనపు కార్యదర్శి రేవు ముత్యాలరాజు హాజరుకు హైకోర్టు బుధవారం ఆదేశాలిచ్చింది. అప్పటి నిడదవోలు తహసీల్దారు శాస్త్రి, పంచాయతీరాజ్‌ సబ్‌ డివిజినల్‌ ఇంజినీరు ఎం.గంగరాజు తదితరులూ హాజరవ్వాలని స్పష్టం చేసింది. కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు ప్రాథమికంగా అభిప్రాయపడిన కోర్టు.. ఎందుకు శిక్షించకూడదో వివరణ ఇవ్వాలని కోరింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ బుధవారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రగూడెం పంచాయతీలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల భవనం, స్థలాన్ని ఆక్రమించి వేడుకలు నిర్వహిస్తున్నారని పేర్కొంటూ షేక్‌ సిలార్‌ 2020లో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు.. సర్వే చేసి, పాఠశాల స్థలంలో ఆక్రమణలుంటే తొలగించాలని, ప్రహరీ నిర్మించాలని 2020 నవంబరు 3న అప్పటి కలెక్టర్‌ ముత్యాలరాజు తదితరులను ఆదేశించింది. ఆ ఉత్తర్వులు అమలు కాకపోవడంతో షేక్‌ సిలార్‌ హైకోర్టులో వ్యాజ్యం వేశారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు