అత్యవసర విచారణకు అనుమతివ్వలేం

పదవీ కాలం ముగిసినా చట్ట విరుద్ధంగా కొనసాగుతున్న హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యవర్గంపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని బార్‌ కౌన్సిల్‌ను ఆదేశిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీలు దాఖలుకు అనుమతి ఇవ్వాలని న్యాయవాది ఉగ్రనరసింహ బుధవారం చేసిన అభ్యర్థనను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది.

Published : 01 Dec 2022 05:12 IST

హైకోర్టు న్యాయవాదుల సంఘం  ఎన్నికలపై తేల్చి చెప్పిన ధర్మాసనం

ఈనాడు, అమరావతి: పదవీ కాలం ముగిసినా చట్ట విరుద్ధంగా కొనసాగుతున్న హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యవర్గంపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని బార్‌ కౌన్సిల్‌ను ఆదేశిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీలు దాఖలుకు అనుమతి ఇవ్వాలని న్యాయవాది ఉగ్రనరసింహ బుధవారం చేసిన అభ్యర్థనను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. వివరాలను సమర్పించాలనే జడ్జి ఆదేశాలిచ్చారని, వాటిపై అప్పీలు ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించింది. ఎన్నికల వివాదంకన్నా ముఖ్యమైన కేసులు తమ ముందు విచారణకు ఉన్నాయని ఘాటుగా వ్యాఖ్యానించింది. కనీసం గురువారం విచారణ జరపాలని న్యాయవాది చేసిన అభ్యర్థననూ తోసిపుచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని