పసిబిడ్డ ప్రాణం తీసిన కోతి

ఓ చిన్నారి బోసి నవ్వులను కోతి చిదిమేసింది. ఆరు బయట మంచంపై పడుకున్న మూడు నెలల పసిబిడ్డను ఈడ్చుకెళ్లి ఇనుప సామగ్రిపై జారవిడిచింది. దీంతో తలకు తీవ్రగాయాలై బిడ్డ అక్కడికక్కడే మృతి చెందింది.

Published : 02 Dec 2022 02:53 IST

పీసీపల్లి, న్యూస్‌టుడే: ఓ చిన్నారి బోసి నవ్వులను కోతి చిదిమేసింది. ఆరు బయట మంచంపై పడుకున్న మూడు నెలల పసిబిడ్డను ఈడ్చుకెళ్లి ఇనుప సామగ్రిపై జారవిడిచింది. దీంతో తలకు తీవ్రగాయాలై బిడ్డ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దుర్ఘటన ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలంలోని మురుగమ్మి గ్రామంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకోగా గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బేల్దారీ మేస్త్రిగా పనిచేస్తున్న రవీంద్ర, సుమతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తెకు ఇటీవలే రెండు నెలలు నిండి మూడో నెల వచ్చింది. బుధవారం ఇంటి ఆవరణలో మంచం మీద చిన్నారిని పడుకోబెట్టి తల్లి ఇంటి పనుల్లో నిమగ్నమైంది. ఈ క్రమంలో ఓ కోతి వచ్చి పాపను ఎత్తుకెళుతూ కొద్దిదూరం ఈడ్చుకెళ్లి ఇనుప సామగ్రిపై పడేసింది. చిన్నారి ఏడుపు విని పరుగున వచ్చిన తల్లికి రక్తపు మడుగులోఉన్న బిడ్డను చూసి బిగ్గరగా కేకలు వేస్తూ రోదించింది. కొన్ని క్షణాల్లోనే బిడ్డ చనిపోయింది.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు