ఆరోగ్య పథకాలకు యాప్‌లు
రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలు, ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్న చికిత్సల వివరాలను ప్రజలు సులభంగా తెలుసుకునేలా ప్రత్యేకంగా యాప్‌లు రూపొందించాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.
ఆరోగ్యశ్రీ సేవలపైనా రూపొందించండి
అధికారులకు సీఎం జగన్ ఆదేశం
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలు, ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్న చికిత్సల వివరాలను ప్రజలు సులభంగా తెలుసుకునేలా ప్రత్యేకంగా యాప్‌లు రూపొందించాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో నెట్వర్క్ ఆసుపత్రులు ఎక్కడ ఉన్నాయి? వాటిల్లో ఎన్ని రకాల వైద్యం అందుబాటులో ఉంది? వాటి లొకేషన్ వంటి వివరాలను తెలుసుకునేలా యాప్ ఉండాలన్నారు. ఫ్యామిలీ డాక్టర్ పథకంపైనా యాప్‌ను తయారు చేయాలన్నారు. ఈమేరకు గురువారం వైద్యారోగ్య శాఖ పనితీరును సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘ప్రస్తుత ఆరోగ్యశ్రీ కార్యాలయ సాఫ్ట్వేర్ మరింత మెరుగుపడాలి. ఆరోగ్యశ్రీ సేవల విషయంలో ఏమైనా తప్పులు జరిగితే కచ్చితంగా చర్యలు తీసుకోవాలి. సేవల్లో లోపం లేకుండా ప్రత్యేక దృష్టి సారించాలి. ‘ఫ్యామిలీ డాక్టర్’పై పర్యవేక్షణకు రాష్ట్ర, నియోజకవర్గ, మండల స్థాయిల్లో అధికారులను నియమించాలి. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలి. ఆరోగ్య రంగంలో ఎలాంటి ఫిర్యాదునైనా 104 ద్వారా స్వీకరించాలి. ఈ నంబరుపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాలి. ఫ్యామిలీ డాక్టర్ సంబంధిత గ్రామాలకు వెళ్లినప్పుడు ‘రియల్ టైం డేటా’ను రికార్డు చేయాలి. ఈ పథకం అమలులో మహిళా, శిశు సంక్షేమ శాఖను భాగస్వామ్యం చేయాలి. పిల్లలు, గర్భిణులు, బాలింతల్లో రక్తహీనతను గుర్తించి వివరాలను మహిళా, శిశు సంక్షేమ శాఖకు అందచేయాలి. ఇందుకు అనుగుణంగా పౌష్ఠికాహారం పంపిణీ జరగాలి. ఆరోగ్య శాఖలోని ఆశావర్కర్ స్థాయి వరకు ట్యాబులు/సెల్ఫోన్లను పంపిణీ చేయాలి. వచ్చే ఉగాది నాటికి విలేజ్ క్లినిక్కుల నిర్మాణాలు పూర్తి చేయాలి’ అని స్పష్టంచేశారు.
7.86 లక్షల మందికి సేవలు: అధికారులు
ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలుకు కొత్తగా 260 అంబులెన్సులు ఈ నెలలోనే అందుబాటులోనికి రానున్నాయి. ఈ పథకం ద్వారా నవంబరులో 7,166 విలేజ్ క్లినిక్కులకు రెండుసార్లు చొప్పున, 2,866 క్లినిక్కులకు ఒకసారి చొప్పున వాహనం వెళ్లింది. నెల రోజుల వ్యవధిలో 7,86,226 మందికి సేవలు అందాయి. వీరిలో రక్తపోటులో బాధపడేవారు 1,78,387 మంది, చక్కెర వ్యాధి బాధితులు 1,25,948 మంది ఉన్నట్లు గుర్తించాం. వీరందరికీ ఉచితంగా మందుల పంపిణీ జరుగుతోంది. పాఠశాల విద్యార్థులు, అంగన్వాడీల్లోని పిల్లలు, గర్భిణుల్లో రక్తహీనతను గుర్తించి... చికిత్స అందిస్తున్నాం. ఫ్యామిలీ డాక్టర్ పథకం అమలులో సిబ్బంది భాగస్వామ్యం పెరిగింది’ అని సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. సమావేశంలో మంత్రి విడదల రజిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Andhra News: ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య.. ఘటనాస్థలం వద్దకు వెళ్లిన వార్డెన్ హఠాన్మరణం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
PV Sindhu: ఆ స్వర్ణం కోసం అయిదేళ్లు ఎదురుచూశా: పీవీ సింధు
-
Politics News
YSRCP: ప్రతి ఇంటికీ జగన్ స్టిక్కర్!
-
Crime News
సహజీవనం చేస్తూ హతమార్చాడు: తల్లీకుమార్తెలను గునపంతో కొట్టి చంపిన ప్రియుడు
-
Sports News
Sunil Gavaskar: బ్రిస్బేన్ పిచ్ గురించి మాట్లాడరేం?