బంగ్లాదేశ్‌లో డాలర్ల కొరత.. నిలిచిన మిర్చి ఎగుమతులు
బంగ్లాదేశ్‌ను అమెరికా డాలర్ల కొరత వేధిస్తోంది. అక్కడి ఆర్థిక పరిస్థితుల కారణంగా వాటి నిల్వలు క్షీణించాయి. ఈ ప్రభావంతో ఇండియా-బంగ్లాదేశ్ మధ్య మిర్చి లావాదేవీలు తగ్గిపోయాయి.
ఈనాడు-అమరావతి: బంగ్లాదేశ్‌ను అమెరికా డాలర్ల కొరత వేధిస్తోంది. అక్కడి ఆర్థిక పరిస్థితుల కారణంగా వాటి నిల్వలు క్షీణించాయి. ఈ ప్రభావంతో ఇండియా-బంగ్లాదేశ్ మధ్య మిర్చి లావాదేవీలు తగ్గిపోయాయి. సుమారు 3-4 నెలల నుంచి ఈ పరిస్థితి ఉన్నా.. ఇటీవల మరింత ఎక్కువైంది. రెండు వారాల వ్యవధిలో గుంటూరులో మిర్చి ధరలు తగ్గడానికి ఇది కూడా ఓ కారణమైంది. ప్రభుత్వం తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని రైతులు, వ్యాపారులు కోరుతున్నారు. ఇండియా నుంచి తేజ రకం మిర్చి ఎగుమతయ్యే దేశాల్లో చైనా, బంగ్లాదేశ్ ముందు వరుసలో ఉన్నాయి. చైనాలో కరోనాతో లాక్డౌన్ పరిస్థితులు పెరగడంతో అక్కడికి ఎగుమతులు పూర్తిగా మందగించాయి. ఇదే సమయంలో బంగ్లాదేశ్‌లో డాలర్ సంక్షోభంతో ప్రతికూల పరిస్థితి ఏర్పడింది. గుంటూరు మార్కెట్‌కు కొత్త సరకు వస్తున్న సమయంలో తేజ రకం మిర్చి ధరలు తగ్గుతుండటం కర్షకులను కలవరపెడుతోంది. ఈ రకం క్వింటాకు రూ.2 వేల వరకు ధర తగ్గింది.
లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్సీ) ఇవ్వని బ్యాంకులు
బంగ్లాదేశ్‌లో మిర్చి వ్యాపారులు పది శాతం సొమ్ము చెల్లిస్తే వారి మీద నమ్మకంతో అక్కడి బ్యాంకులు 100 శాతానికి లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్సీ) మంజూరు చేసేవి. దీని ఆధారంగా మన దేశ వ్యాపారులు మిర్చి ఎగుమతి చేసేవారు. ప్రస్తుతం అక్కడ నెలకొన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మొత్తం సొమ్ము చెల్లించినా ఎల్సీ ఇవ్వడం లేదు. ఇదే మిర్చి వ్యాపారానికి శరాఘాతంగా మారింది. ఈ నేపథ్యంలో డాలర్లకు ప్రత్యామ్నాయంగా రూపాయి మారకపు విలువతో లావాదేవీలు జరిగేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని వ్యాపారులు కోరుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
CRPF Jobs: సీఆర్పీఎఫ్లో ఏఎస్సై, హెడ్‌కానిస్టేబుల్ పోస్టులు.. దరఖాస్తుకు నేడే తుది గడువు
-
Crime News
Bribe: రూ.2.25 లక్షల లంచం తీసుకుంటూ.. అనిశాకు చిక్కిన అధికారి
-
Movies News
Social Look: క్యాప్షన్ కోరిన దీపికా పదుకొణె.. హాయ్ చెప్పిన ఈషా!
-
Sports News
Gill - Prithvi Shaw: వన్డేలకు శుభ్‌మన్ గిల్.. టీ20లకు పృథ్వీ షా సరిపోతారు: గంభీర్
-
General News
AP High Court: గవర్నర్‌కు ఉద్యోగుల ఫిర్యాదు అంశంపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్
-
Sports News
IND vs NZ: లఖ్‌నవూ ‘షాకింగ్’ పిచ్.. క్యురేటర్‌పై వేటు..!