Andhra News: పింఛను డబ్బు నుంచి చెత్తపన్ను వసూలు

వృద్ధులకు అందించే పింఛను డబ్బుల నుంచి చెత్తపన్ను మినహాయించుకున్న సంఘటనలు పురపాలక సంఘం, గ్రామపంచాయతీలో గురువారం వెలుగుచూశాయి.

Updated : 02 Dec 2022 08:53 IST

నరసరావుపేట మున్సిపాలిటీ, అనంత జిల్లా హావళిగి గ్రామంలో నిర్వాకాలు

నరసరావుపేట అర్బన్‌, విడపనకల్లు- న్యూస్‌టుడే: వృద్ధులకు అందించే పింఛను డబ్బుల నుంచి చెత్తపన్ను మినహాయించుకున్న సంఘటనలు పురపాలక సంఘం, గ్రామపంచాయతీలో గురువారం వెలుగుచూశాయి. పల్నాడు జిల్లాకేంద్రం నరసరావుపేట పురపాలక సంఘం పరిధి పాత 18వ వార్డులో సామాజిక పింఛన్లను పంపిణీ చేశారు. ఐదు నెలలకు చెత్తపన్ను రూ.300 మినహాయించుకుని మిగిలిన మొత్తం ఇచ్చారు. ఉన్నతాధికారులు ఇలా చేయమన్నారని సిబ్బంది చెప్పారని పలువురు పింఛనుదారులు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. పింఛను సొమ్ము నుంచి మినహాయించుకోవద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చామని పురపాలక సంఘం కమిషనర్‌ రవీంద్ర వివరణ ఇచ్చారు. దీనిపై విచారణ చేస్తామన్నారు. మరో సంఘటనలో.. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం హావళిగి గ్రామంలో పింఛన్లు పంచుతున్నప్పుడు ఇంటి పన్ను చెల్లించని వారిని సిబ్బంది గుర్తించారు. వారి పింఛను మొత్తంలో నుంచి చెత్త పన్ను డబ్బులు పట్టుకుని ఇచ్చేలా అధికారులు వాలంటీర్లకు సూచనలిచ్చారు. ఇలా గ్రామంలో సుమారు 20 మందికిపైగా లబ్ధిదారుల పింఛనునుంచి ఇంటి పన్ను మినహాయించుకున్నారు. పింఛన్లు పంపిణీ కావడంతో ఇళ్లవద్దకు వెళ్లామని, తాము ఎవరి వద్ద బలవంతంగా వసూలు చేయలేదని పంచాయతీ కార్యదర్శి సురేష్‌కుమార్‌ వివరణ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు