భూములు లాక్కుంటే ఉరే!

జీవనాధారమైన భూములు లాక్కుంటే తమకు మిగిలేది ఉరేనని అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ గిరిజన రైతులు గురువారం ఆందోళన చేశారు.

Published : 02 Dec 2022 04:35 IST

అనంతగిరి, న్యూస్‌టుడే: జీవనాధారమైన భూములు లాక్కుంటే తమకు మిగిలేది ఉరేనని అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ గిరిజన రైతులు గురువారం ఆందోళన చేశారు. చెట్లకు ఉరేసుకున్నట్లుగా వేలాడుతూ వినూత్న నిరసన తెలిపారు. కోనేల, బూరుగ తదితర గ్రామాల్లోని భూములను కొందరు గిరిజనేతర పెద్దలు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని రైతులు ఆరోపించారు. ఆయా గ్రామాల్లో సుమారు 200 జనాభా ఉండగా, 90 ఎకరాల భూములు ఉన్నాయని చెప్పారు. వీటిని లాక్కునేందుకు బడాబాబులు యత్నిస్తుండగా, రెవెన్యూ సిబ్బందీ వారికే వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు