రోడ్డు మరమ్మతులా.. మంత్రినే అడగండి!

రహదారి మరమ్మతుల సమస్యపై మంత్రిని అడగాలని రహదారులు, భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ) డీఈఈ నరసింహులు చెప్పడంపై ప్రజాప్రతినిధులు, వైకాపా నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు.

Published : 02 Dec 2022 04:35 IST

డీఈఈ సమాధానంపై వైకాపా నేతల ఆగ్రహం

పర్చూరు, న్యూస్‌టుడే: రహదారి మరమ్మతుల సమస్యపై మంత్రిని అడగాలని రహదారులు, భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ) డీఈఈ నరసింహులు చెప్పడంపై ప్రజాప్రతినిధులు, వైకాపా నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామాల వారీగా సమస్యలపై చర్చించేందుకు వివిధ శాఖల అధికారులతో వైకాపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి రావి రామనాథంబాబు గురువారం బాపట్ల జిల్లా పర్చూరు యార్డులో సమీక్షా సమావేశం నిర్వహించారు. పర్చూరు-ఇంకొల్లు రహదారిలో గుంతల్లో పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకోవడం లేదంటూ ఆందోళన వ్యక్తంచేశారు. నిధులు మంజూరు చేసి మూడేళ్లు దాటినా పనులు చేపట్టకపోవడంపై ప్రశ్నించారు. ‘దీనిపై నేను చేయగలిగిందేమీ లేదు. మంత్రినే అడగాలి’ అని ఆర్‌అండ్‌బీ డీఈఈ నరసింహులు బదులిచ్చారు. మంత్రిని అడగాల్సి ఉంటే.. సమావేశానికి మీరెందుకు వచ్చారంటూ నాయకులు ప్రశ్నించడంతో ఆయన బయటకు వెళ్లిపోయారు. ప్రొటోకాల్‌ లేని రామనాథంబాబు సమీక్షించగా, సమాధానం చెప్పుకోలేక ఉన్నతాధికారి వెళ్లిపోవడం గమనార్హం.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని