జగనన్నా.. జీతాలు చెల్లించన్నా: ప్రభుత్వ ఉద్యోగి వాట్సప్‌ స్టేటస్‌

‘జగనన్నా.. ఒకటో తేదీ వచ్చిందన్న. మా జీతాలు చెల్లించన్నా’ అంటూ ఓ ప్రభుత్వ ఉద్యోగి తన ఆవేదనను వాట్సప్‌ ద్వారా పోస్టు చేశారు.

Updated : 02 Dec 2022 07:17 IST

‘జగనన్నా.. ఒకటో తేదీ వచ్చిందన్న. మా జీతాలు చెల్లించన్నా’ అంటూ ఓ ప్రభుత్వ ఉద్యోగి తన ఆవేదనను వాట్సప్‌ ద్వారా పోస్టు చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం గుత్తి మండలంలోని ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే అటెండర్‌ ‘జగనన్న శాలరీలు క్రెడిట్‌ చేయి అన్న.. మాకు ఈఎంఐ కష్టాలు ఉన్నాయన్నా’ అంటూ రెండు చేతులు జోడించి మొక్కే ఎమోజీతో వాట్సప్‌లో స్టేటస్‌గా పెట్టారు. ఇది జీతాలు అందని ఉద్యోగుల ఆవేదనను తెలియజేస్తోంది.

- న్యూస్‌టుడే, గుత్తి గ్రామీణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని