సీవీ సుబ్బారెడ్డి వెళ్లే.. బాలు నాయక్‌ వచ్చే

రాష్ట్ర పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ)గా సీవీ సుబ్బారెడ్డి నియామకంపై విమర్శలు రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.

Published : 02 Dec 2022 04:35 IST

పంచాయతీరాజ్‌ ఈఎన్‌సీ నియామక జీవోను వెనక్కి తీసుకున్న ప్రభుత్వం

ఈనాడు, అమరావతి: రాష్ట్ర పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ)గా సీవీ సుబ్బారెడ్డి నియామకంపై విమర్శలు రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 24 గంటల వ్యవధిలోనే ఆయన నియామకాన్ని రద్దు చేసింది. ఈఎన్‌సీగా బి.బాలు నాయక్‌కు పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) అప్పగిస్తూ గురువారం ఆగమేఘాలపై ఉత్తర్వులు జారీ చేసింది. పదవీ కాలం ముగియడంతో రెండు రోజుల క్రితం వరకు ఈఎన్‌సీగా ఉన్న బి.సుబ్బారెడ్డి వైదొలగడంతో ప్రధాన ఇంజినీర్ల (సీఈ) సీనియారిటీ జాబితాలో ఐదో పేరున్న సీవీ సుబ్బారెడ్డిని ప్రభుత్వం ఈఎన్‌సీగా నియమించింది. ఈ మేరకు బుధవారం ఆయన బాధ్యతలు కూడా చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ నియామకంపై ‘ఈనాడు’లో గురువారం ‘బి.సుబ్బారెడ్డి వైదొలిగే...సీవీ సుబ్బారెడ్డి వచ్చే ...పంచాయతీరాజ్‌ ఈఎన్‌సీ నియామకంలో మరోసారి భంగపడ్డ ఎస్సీ, ఎస్టీ ఇంజినీర్లు’ శీర్షికతో వార్త వెలువడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈఎన్‌సీగా సీవీ సుబ్బారెడ్డిని నియమిస్తూ నవంబరు 29న జారీ చేసిన జీవో 938ని వెనక్కి తీసుకొని... సీఈల సీనియారిటీ జాబితాలో ఒకటో స్థానంలో ఉన్న బాలు నాయక్‌ని ఈఎన్‌సీగా నియమిస్తూ మరో జీవో 942ని గురువారం విడుదల చేసింది. ఈ మేరకు ఆయన సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. సీవీ సుబ్బారెడ్డి డిప్యుటేషన్‌పై పని చేస్తున్న గ్రామీణాభివృద్ధిశాఖకు మళ్లీ వెళ్లారని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు