కౌన్సిలరే పారిశుద్ధ్య కార్మికుడైన వేళ

దోమల బెడదను తగ్గించలేని అధికారుల తీరుకు నిరసనగా కౌన్సిలరే పారిశుద్ధ్య కార్మికుడి అవతారమెత్తారు. ఎన్టీఆర్‌ జిల్లా కొండపల్లి పురపాలిక మొదటి వార్డు కౌన్సిలర్‌ చంద్రశేఖర్‌ స్వయంగా కాలనీల్లో దోమల మందు పిచికారీ చేశారు.

Published : 02 Dec 2022 04:35 IST

కొండపల్లి, న్యూస్‌టుడే: దోమల బెడదను తగ్గించలేని అధికారుల తీరుకు నిరసనగా కౌన్సిలరే పారిశుద్ధ్య కార్మికుడి అవతారమెత్తారు. ఎన్టీఆర్‌ జిల్లా కొండపల్లి పురపాలిక మొదటి వార్డు కౌన్సిలర్‌ చంద్రశేఖర్‌ స్వయంగా కాలనీల్లో దోమల మందు పిచికారీ చేశారు. పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని పలుమార్లు కమిషనర్‌ను కోరారు. సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. మరోవైపు స్థానికులు కౌన్సిలర్‌పై ఒత్తిడి తెచ్చారు. విధిలేక అధికారుల తీరును నిరసిస్తూ గురువారం సాయంత్రం స్వయంగా దోమల నివారణ మందు పంపును వీపునకు తగిలించుకొని శాంతినగర్‌, ఇందిరమ్మ కాలనీల్లో మురుగు కాలువల్లో పిచికారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని