4న రాష్ట్రానికి రాష్ట్రపతి

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 4, 5వ తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. గవర్నర్‌ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోడియా గురువారం ఈ వివరాలను వెల్లడించారు. ‘4న ఉదయం 10:15 గంటలకు రాష్ట్రపతి విజయవాడ చేరుకుంటారు.

Published : 02 Dec 2022 04:35 IST

సన్మానించనున్న రాష్ట్ర ప్రభుత్వం
రాజ్‌భవన్‌లో విందు ఇవ్వనున్న గవర్నర్‌

ఈనాడు, అమరావతి: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 4, 5వ తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. గవర్నర్‌ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోడియా గురువారం ఈ వివరాలను వెల్లడించారు. ‘4న ఉదయం 10:15 గంటలకు రాష్ట్రపతి విజయవాడ చేరుకుంటారు. అక్కడి నుంచి పోరంకిలోని ఒక రిసార్టులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన పౌరసన్మాన కార్యక్రమానికి హాజరవుతారు. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, సీఎం జగన్‌.. రాష్ట్రపతిని సన్మానిస్తారు. రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖులు రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలుస్తారు. ఆ కార్యక్రమం తర్వాత రాష్ట్రపతి.. రాజ్‌భవన్‌కు చేరుకొని గవర్నర్‌ ఏర్పాటు చేసే అధికారిక విందులో పాల్గొంటారు. అనంతరం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం వెళతారు. అక్కడ జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలోని పలు రహదారులకు రాష్ట్రపతి ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేస్తారు. రాత్రికి విశాఖ నుంచి తిరుపతికి చేరుకుని అక్కడే బస చేస్తారు. సోమవారం ఉదయం తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని, గోశాలను పరిశీలిస్తారు. అనంతరం పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థులతో భేటీ అవుతారు. ఈ కార్యక్రమాల తర్వాత రాష్ట్రపతి తిరుపతి నుంచే దిల్లీకి బయల్దేరి వెళతారు’ అని గవర్నర్‌ ప్రత్యేక కార్యదర్శి సిసోడియా పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు