Vijayasai Reddy: కేసూ లేదు... దర్యాప్తూ లేదు
వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి సెల్‌ఫోన్ పోయిందంటూ ఆయన వ్యక్తిగత సహాయకుడు గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసి పది రోజులు గడుస్తున్నా దానిపై కేసూ నమోదు చేయలేదు.. దర్యాప్తూ చేపట్టలేదు.
వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి సెల్‌ఫోన్ వ్యవహారంలో అనుమానాలు
ఈనాడు, అమరావతి: వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి సెల్‌ఫోన్ పోయిందంటూ ఆయన వ్యక్తిగత సహాయకుడు గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసి పది రోజులు గడుస్తున్నా దానిపై కేసూ నమోదు చేయలేదు.. దర్యాప్తూ చేపట్టలేదు. ‘విజయసాయిరెడ్డి ఇప్పుడు ఆ ఫోన్ వినియోగించట్లేదు. ఆయన వ్యక్తిగత సహాయకుడు వాడుతున్నారు. ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తి ఆ తర్వాత తదుపరి చర్యలు వద్దని కోరారు. అందుకే ముందుకు వెళ్లలేదు’ అని పోలీసువర్గాలు చెబుతున్నాయి. పోయిన ఫోన్ ఎక్కడుందో కనుక్కోవటం పోలీసులకు పెద్ద కష్టం కాదు. టవర్ లొకేషన్, ఐఎంఈఐ నంబరు సహా ఇతర సాంకేతికతల ఆధారంగా ఆ ఫోన్ ఎక్కడున్నా పట్టేయొచ్చు. అధికార పార్టీ ఎంపీ ఫోనే పోతే పోలీసులు ఎంతలా స్పందిస్తారో చెప్పాల్సిన పనిలేదు. కానీ విజయసాయిరెడ్డి సెల్‌ఫోన్ వ్యవహారంలో పోలీసుల తీరుపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత సెల్‌ఫోన్ పోయిందని ఫిర్యాదిచ్చి, తర్వాత చర్యలు వద్దనడంలో ఆంతర్యంపైనా అనుమానాలు తలెత్తుతున్నాయి.
దిల్లీ మద్యం కుంభకోణం అనుమానితుల సెల్ఫోన్లు ధ్వంసం
దిల్లీ మద్యం కుంభకోణంలో తాజాగా అమిత్ అరోడాను అరెస్టుచేసిన ఈడీ.. ఈ కేసులో అనుమానితులు, భాగస్వాములు 36 మంది గతేడాదిలో 170 సెల్ఫోన్లు ధ్వంసం చేశారని రిమాండు రిపోర్టులో పేర్కొంది. ఇదే కేసులో ఇప్పటికే అరెస్టయిన విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్‌చంద్రారెడ్డి తొమ్మిది సెల్ఫోన్లు ధ్వంసం చేశారని వెల్లడించింది. ఈ కేసులో విలువైన సాక్ష్యాధారాలు, ముడుపుల వివరాలున్న డిజిటల్ డేటాను ధ్వంసం చేశారని, సాక్ష్యాల చెరిపివేతకు ప్రయత్నించారని వివరించింది. ఈ నేపథ్యంలో ఎంపీ విజయసాయిరెడ్డి ఫోన్ పోయిందంటూ ఫిర్యాదు అందడంపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
అటు శరత్ చంద్రారెడ్డి ఈడీ కస్టడీ... ఇటు ఫోన్ పోయిందంటూ ఫిర్యాదు
దిల్లీ మద్యం కుంభకోణంలో కింగ్‌పిన్‌గా పేర్కొంటూ పెనాక శరత్‌చంద్రారెడ్డిని నవంబరు 10న ఈడీ అరెస్టుచేసింది. ఆయన్ను కస్టడీకి తీసుకుని నవంబరు 21 వరకూ విచారించింది. అదే రోజు వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కోర్టు ప్రాంగణంలో శరత్‌చంద్రారెడ్డిని కలిశారు. తర్వాత నవంబరు 21న విజయసాయిరెడ్డి ఫోన్ కనిపించట్లేదని, చోరీకి గురైందని భావిస్తున్నామంటూ 23న ఆయన వ్యక్తిగత సహాయకుడు లోకేశ్వరరావు తాడేపల్లి పోలీసుస్టేషన్లో ఫిర్యాదుచేశారు. ‘దిల్లీ మద్యం కుంభకోణం నుంచి తప్పించుకోవటానికే ఫోన్ పోయిందంటూ విజయసాయిరెడ్డి నాటకం ఆడారు. ఆ ఫోన్లో శరత్‌చంద్రారెడ్డి, విజయసాయిరెడ్డిల మధ్య జరిగిన లావాదేవీలు, దిల్లీ మద్యం కుంభకోణం వివరాలు ఉండి ఉంటాయి’ అని తెదేపా నాయకులు అయ్యన్నపాత్రుడు, జవహర్ అప్పట్లో ఆరోపించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
PCB: పీసీబీ నిర్ణయం.. పాక్ క్రికెట్ వ్యవస్థకు ఎదురుదెబ్బ: మిస్బాఉల్ హక్
-
India News
IND-AUS: అలాంటి కార్యకలాపాలను అనుమతించొద్దు.. ఆస్ట్రేలియాకు భారత్ విజ్ఞప్తి
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!
-
India News
Mussorie: ముస్సోరీలో వెంటనే అధ్యయనం చేయండి: గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశం
-
India News
Jammu Kashmir: కశ్మీర్ ఉగ్రవాదుల కొత్త ఆయుధం.. పెర్ఫ్యూమ్ బాంబ్!
-
Sports News
Shubman Gill: ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ ఫన్నీ వీడియో.. చూస్తే నవ్వు ఆగదు